రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష

కరోనావైరస్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర ఖజానాకి భారీగా గండి పడింది. రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లడంతో రాష్ట్ర ఖజనాకి రావల్సిన పన్నులు బాగా తగ్గిపోయాయి. కేంద్ర నుంచి రావల్సిన పన్నుల్లోనూ కోత పడింది. దీంతో పేదలకు చెల్లించాల్సిన ఫించన్లను యథావిధిగా కొనసాగించి.. ప్రభుత్వ ఉద్యోగుల మే నెల జీతాల్లో కోత విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితిపై ప్రగతి భవన్ లో మంత్రులు, ఉన్నతాధికారులతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష […]

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: May 27, 2020 | 9:29 PM

కరోనావైరస్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర ఖజానాకి భారీగా గండి పడింది. రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లడంతో రాష్ట్ర ఖజనాకి రావల్సిన పన్నులు బాగా తగ్గిపోయాయి. కేంద్ర నుంచి రావల్సిన పన్నుల్లోనూ కోత పడింది. దీంతో పేదలకు చెల్లించాల్సిన ఫించన్లను యథావిధిగా కొనసాగించి.. ప్రభుత్వ ఉద్యోగుల మే నెల జీతాల్లో కోత విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితిపై ప్రగతి భవన్ లో మంత్రులు, ఉన్నతాధికారులతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ప్రస్తుత ఆదాయంతో పాటు ఫించన్ల చెల్లింపులు, ఉద్యోగుల వేతనాలపై ఈ సందర్భంగా చర్చించారు. ఈనెల కూడా పేదలకు 12 కిలోల రేషన్ బియ్యాన్ని యథావిదిగా కొనసాగించాలని సీఎం ఆదేశించారు. పింఛనర్లకు మాత్రం మొత్తం పెన్షన్ చెల్లించాలని సీఎం నిర్ణయించారు. ఇక రాష్ట్రానికి నెలకు రూ. 12 వేల కోట్ల మేర ఆదాయం రావాల్సిన ఉండగా.. మే నెలలో కేవలం రూ.3,100 కోట్లు (కేంద్రం నుంచి వచ్చిన వాటాతో కలిపి) మాత్రమే వచ్చాయని అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. లాక్ డౌన్ నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ ఆదాయం పెద్దగా పెరగలేదన్నారు. రాష్ట్రం అప్పులను రీషెడ్యూల్ చేయకపోవడంతో ఏడాదికి దాదాపు రూ. 37,400 కోట్ల మేర వడ్డీ చెల్లించాల్సి వస్తుందని అధికారులు వివరించారు. ఎఫ్ఆర్‌బీఎం పరిమితి పెంచినప్పటికీ, కేంద్రం విధించిన అనేక షరతుల కారణంగా అదనపు రుణాలను సమకూర్చుకునే పరిస్థితిలో లేమని అధికారులు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యోగుల జీతాలు, పింఛన్లు పూర్తిగా చెల్లించినట్లయితే రూ.3 వేల కోట్లకుపైగా అవుతుందని.. ఖజానా ఖాళీ అవుతుందని అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు ప్రతీ కుటుంబానికి నెలకు 1500 రూపాయల నగదు ఇచ్చే కార్యక్రమం మే నెల నిలిపివేయాలని అధికారులు సూచించారు. ఇక ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం,ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోతలను మే నెలలో కూడా కోత కొనసాగుతుంది.

చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!