What is Before You? కాఫీ కళ్లముందే ఉంది.. అయినా సమాధానం ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూలో టాపర్ ప్రశ్న

ముఖ్యంగా UPSC వంటి ఇంటర్వ్యూలో సరైన సమాధానం కంటే, ఆ సమాధానానికి మీరు ఇచ్చే reasoning చాలా ముఖ్యమైనది. ఇలాంటి ఒక్క ప్రశ్నతో అభ్యర్థి ప్రతిభను నిర్ణయించరు. ఇంటర్వ్యూలో అభ్యర్థి వ్యక్తిత్వం, నిర్ణయాలు తీసుకునే విధానం, పరిపాలనా దృక్పథం, జ్ఞానం, కమ్యూనికేషన్ తదితర అంశాలను కలిపి అంచనా వేస్తారు. అలాంటిదే ఇది.. మీ ముందు కాఫీ కప్పు ఉన్నా.. 'నీ ముందు ఏముంది? (What is Before You?)' అని అడిగితే అభ్యర్థి 'టీ' అని సమాధానం ఇచ్చాడు. ఎందుకో తెలుసా..?

What is Before You? కాఫీ కళ్లముందే ఉంది.. అయినా సమాధానం ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూలో టాపర్ ప్రశ్న
UPSC Interview Logic Puzzle

Updated on: Oct 07, 2026 | 1:27 PM

‘కాఫీ నీ ముందు పెట్టి.. మరి నీ ముందు ఏముంది?’ అని అడిగితే చాలామంది వెంటనే ‘కాఫీ’ అని సమాధానం చెబుతారు. కానీ ఈ ప్రశ్నలో దాగున్న అసలు ట్విస్ట్‌ మాత్రం వేరే ఉంది. యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్లిన ఓ అభ్యర్థి కోసం ఒక వ్యక్తి కప్పు కాఫీ ఆర్డర్ చేశాడు. కాఫీ వచ్చింది. దాన్ని అభ్యర్థి ముందు పెట్టారు. అనంతరం అతడిని చూస్తూ.. ‘What is before you?’ అని ప్రశ్నించారు. కాఫీ తన ముందు ఉన్నందున సమాధానం ‘Coffee’ అని చెప్పడం సహజమే. కానీ అభ్యర్థి మాత్రం ‘Tea’ అని సమాధానం ఇచ్చాడు. వెంటనే సంబర పడిపోయిన ఇంటర్వ్యూ ప్యానెల్‌ అతడికి ఫుల్ మార్కులు వేసేసింది. ఇక్కడ మీకు వచ్చే డౌట్‌ ఏమంటే.. అతని ముందు కాఫీ ఉంటే టీ అని ఎందుకు చెప్పాడు? అదే కదా.. అసలు ట్విస్ట్‌ అదే మరి!

‘టీ’ అని ఎందుకు చెప్పాడంటే..?

ఇక్కడే ఈ ప్రశ్నలోని అసలు లాజిక్ దాగి ఉంది. ‘What is before you?’ అనే ప్రశ్నలో ‘you’ అనే పదాన్ని గమనించాలి. ఇక్కడ you అంటే వ్యక్తిని సూచించడంతో పాటు, ఆంగ్ల అక్షరమాల పరంగా ‘U’ అనే అక్షరాన్ని కూడా సూచిస్తుంది. ఆంగ్ల అక్షరమాలలో ‘T’ అక్షరం ‘U’కి ముందు ఉంటుంది.

అప్పుడు T → Uకి ముందు ఉన్నట్లే కదా!

అందుకే ‘What is before U?’ అని భావిస్తే.. సమాధానం T

ఇవి కూడా చదవండి

అదే T = Tea

కాబట్టి అభ్యర్థి ఇచ్చిన సమాధానం Tea కరెక్ట్‌ అని ఇంటర్వ్యూ ప్యానెల్‌ చెప్పింది.

ప్రశ్న కంటే పరిశీలన ముఖ్యం

ఈ పజిల్‌లో కాఫీ నిజంగానే అభ్యర్థి ముందు ఉన్నప్పటికీ.. ప్రశ్నలోని పదప్రయోగాన్ని సరిగ్గా గమనిస్తే సమాధానం అర్థమవుతుంది. కేవలం కళ్ల ముందు కనిపిస్తున్న వస్తువును బట్టి కాకుండా.. ప్రశ్నను ఎలా అడిగారు? అందులోని పదాలకు మరో అర్థం ఉందా? అనే కోణంలో ఆలోచించడమే ఈ పజిల్‌లో కీలకం. ఇలాంటి ప్రశ్నలు అభ్యర్థి పరిశీలన, తార్కిక ఆలోచన, పదాలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి. అందుకే సోషల్ మీడియాలో ఈ UPSC Interview Question తెగ వైరల్ అవుతోంది. చిన్న ప్రశ్న.. సింపుల్‌గా కనిపించే ప్రశ్న.. కానీ సమాధానం చెప్పాలంటే మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించాలి!

Loading...
Unable to load recommendations.
Follow Us