UPSCలో 450 గ్రూప్ A, B కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. జులై 17 వరకే డెడ్‌లైన్.. పోస్టులు, అర్హతలు పూర్తి వివరాలివే
UPSC Recruitment 2026: కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం సాధించాలని భావిస్తున్న అభ్యర్థులకు యూపీఎస్సీ శుభవార్త చెప్పింది. మొత్తం 450 గ్రూప్ A, గ్రూప్ B గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు జులై 17, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వారీగా ఖాళీలు, విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలు తెలుసుకోండి.

కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ ‘A’, గ్రూప్ ‘B’ గెజిటెడ్ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 54 రకాల పోస్టుల్లో 450 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో జులై 17, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
మొత్తం ఖాళీలు
- మొత్తం పోస్టులు: 450
- పోస్టుల రకాలు: 54
- ఉద్యోగాల కేటగిరీ: గ్రూప్ ‘A’, గ్రూప్ ‘B’ గెజిటెడ్ పోస్టులు
ముఖ్యమైన పోస్టులు – ఖాళీల వివరాలు
- డ్రగ్ ఇన్‌స్పెక్టర్ – 186
- స్పెషలిస్ట్ గ్రేడ్-III (వివిధ విభాగాలు) – 104
- కంపెనీ ప్రాసిక్యూటర్ – 18
- లీగల్ ఆఫీసర్ – 12
- ఏరోనాటికల్ ఆఫీసర్ – 11
- అసిస్టెంట్ ఇంజినీర్ – 11
- సివిలియన్ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ – 7
- రాజ్‌భాషా అధికారి – 7
- జాయింట్ డైరెక్టర్ – 6
- సైంటిఫిక్ ఆఫీసర్ – 3
- లెక్చరర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ – 1
- ఇతర పోస్టులు కలిపి మొత్తం 450 ఖాళీలు
విద్యార్హతలు:
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కింది అర్హతల్లో ఏదో ఒకటి ఉండాలి. డిగ్రీ, బీఈ/బీటెక్, పీజీ, ఎంబీబీఎస్, మెడికల్ పీజీ, ఎల్‌ఎల్‌బీ/లా డిగ్రీ, సంబంధిత విభాగంలో అవసరమైన ఉద్యోగ అనుభవం (పోస్టును బట్టి)
వయోపరిమితి
పోస్టును బట్టి గరిష్ఠ వయోపరిమితి 30 నుంచి 50 సంవత్సరాల వరకు నిర్ణయించారు. రిజర్వేషన్ కేటగిరీలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం
అభ్యర్థులు UPSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే ముందు సంబంధిత పోస్టుకు అవసరమైన అర్హతలు, అనుభవం, ఇతర నిబంధనలను అధికారిక నోటిఫికేషన్‌లో తప్పనిసరిగా పరిశీలించాలి.
దరఖాస్తు ఫీజు
- SC/ST, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు: ఫీజు లేదు.
- జనరల్, OBC, EWS పురుష అభ్యర్థులు: రూ.25.
ఎంపిక విధానం
అభ్యర్థుల ఎంపికను మూడు దశల్లో నిర్వహిస్తారు.
- దరఖాస్తుల స్క్రీనింగ్/షార్ట్‌లిస్టింగ్
- అవసరమైతే రిక్రూట్‌మెంట్ టెస్ట్
- ఇంటర్వ్యూ
రిక్రూట్‌మెంట్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను తుది మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీ
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 17, 2026
ముఖ్య గమనిక:
ఈ నోటిఫికేషన్‌లోని ప్రతి పోస్టుకు విద్యార్హతలు, అనుభవం, వయోపరిమితి, రిజర్వేషన్ నిబంధనలు వేర్వేరుగా ఉండవచ్చు. కాబట్టి అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక UPSC నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, తమ అర్హతలను నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయడం మంచిది.
