UPSC Recruitment 2023: కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. ఏయే పోస్టులున్నాయంటే..

యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌.. 40 జాయింట్‌ డైరెక్టర్‌, హార్టికల్చర్‌ స్పెషలిస్ట్‌, అసిస్టెంట్‌ హార్టికల్చర్‌ స్పెషలిస్ట్‌, మార్కెటింగ్‌ ఆఫీసర్‌, ఎకనమిక్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

UPSC Recruitment 2023: కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. ఏయే పోస్టులున్నాయంటే..
UPSC Recruitment

Updated on: Mar 20, 2023 | 8:55 PM

యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌.. 40 జాయింట్‌ డైరెక్టర్‌, హార్టికల్చర్‌ స్పెషలిస్ట్‌, అసిస్టెంట్‌ హార్టికల్చర్‌ స్పెషలిస్ట్‌, మార్కెటింగ్‌ ఆఫీసర్‌, ఎకనమిక్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/ఎంబీబీఎస్‌/ఇంజినీరింగ్‌ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో పోస్టును బట్టి 2 నుంచి పదేళ్ల అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు పోస్టును బట్టి 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 30, 2023వ తేదీ రాత్రి 11 గంటల 59 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు తప్పనిసరిగా రూ.25 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ/మహిళా అభ్యర్ధులు ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఆయా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us