TS Govt Jobs: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతోన్న వారికి గుడ్‌ న్యూస్‌.. టీశాట్‌లో ఉచితంగా కోచింగ్‌..

|

Mar 29, 2022 | 5:32 PM

TS Govt Jobs: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR) ఉద్యోగాల ప్రకటన చేయగానే రాష్ట్రంలో నిరుద్యోగులకు తమ అదృష్టానికి పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టనున్న నేపథ్యంలో ప్రిపరేషన్‌ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పరీక్షలకు..

TS Govt Jobs: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతోన్న వారికి గుడ్‌ న్యూస్‌.. టీశాట్‌లో ఉచితంగా కోచింగ్‌..
Tsat Free Coaching
Follow us on

TS Govt Jobs: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR) ఉద్యోగాల ప్రకటన చేయగానే రాష్ట్రంలో నిరుద్యోగులకు తమ అదృష్టానికి పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టనున్న నేపథ్యంలో ప్రిపరేషన్‌ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పరీక్షలకు ప్రిపేర్‌ అవుతోన్న వారి కోసం టీశాట్‌ ప్రత్యేకంగా డిజిటల్‌ శిక్షణ అందించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం టెట్‌ (TET) దరఖాస్తులు స్వీకరిస్తోన్న నేపథ్యంలో ఏప్రిల్‌ 4 నుంచి మే 4 వరకు మొత్తం 60 రోజుల పాటు 102 ఎపిసోడ్ల ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. ఉదయం, మధ్యాహ్నాల్లో ఒక్కో సబ్జెక్టుకు 30 నిమిషాల పాటు పాఠ్యాంశాలను ప్రసారం చేయనున్నారు.

ఇక శిక్షణ ప్రారంభం చేసే కంటే ముందు వారంపాటు ప్రత్యక్షప్రసారం ద్వారా సబ్జెక్టులు, సిలబస్‌, పరీక్షా విధానం, ప్రిపరేషన్‌ టెక్నిక్స్‌పై అభ్యర్థులకు అవగాహన కల్పిస్తారు. టెట్‌ అభ్యర్థుల కోసం ఏప్రిల్‌ 1 నుంచి 7 వరకు వీటిని నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే ఈ శిక్షణ తరగతులను టెట్‌ పరీక్షకే పరిమితం చేయకుండా త్వరలో గ్రూప్‌-1తో పాటు మరిన్ని పరీక్షలకు నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో సదరు పరీక్షలకు ప్రిపేర్‌ అవుతోన్న వారికి కూడా డిజిటల్‌ శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే సబ్జెక్ట్‌లను రికార్డింగ్‌ చేయిస్తున్నారు. నోటిఫికేషన్లు విడుదల కాగానే శిక్షణ తరగతుల వీడియోలను ప్రసారం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: Pakistan: దాయాది దేశం పాకిస్థాన్‌‌లో రాజకీయ అస్థిరత.. భారత్ ఆందోళన.. ఎందుకంటే?

China plane crash: చైనా విమాన ప్రమాదంలో సిబ్బందితో సహా 132 మంది మృతి! ఆ 2 బాక్సుల ఆధారంగానే నిజానిజాలు తేల్చలేం..

Women at 40 : నలభై ఏళ్లు దాటిన మహిళలు ఫిట్‌గా, హెల్దీగా ఉండాలంటే.. ఈ సూపర్‌ ఫుడ్స్‌ తీసుకోవాల్సిందే..