మరికాసేపట్లో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే

TG SSC 10th Class Supplementary results 2026: రాష్ట్ర పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు కీలక అప్డేట్. 2026 సప్లిమెంటరీ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ అధికారులు నేడు (జూన్ 25) మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి ఫలితాలను సులభంగా చెక్ చేసుకోవచ్చు. ఫలితాల విడుదల అనంతరం మార్కుల మెమోలను కూడా ఈ కింది డైరెక్ట్‌ ఆన్‌లైన్‌ లింక్‌ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..

మరికాసేపట్లో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే
TG SSC Supplementary results

Updated on: Jun 25, 2026 | 6:17 AM

హైదరాబాద్‌, జూన్‌ 25: తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు ఈ రోజు ((జూన్‌ 25న) విడుదల కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్‌ నికోలస్‌ మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కందిమళ్ల లింగయ్య ప్రకటించారు. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఈ కింది డైరెక్ట్‌ లింక్‌ ద్వారా వేగంగా ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. ఫలితాలు వెల్లడైన వెంటనే విద్యార్థులు తమ మార్కుల మెమోలను ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ 2026 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

కాగా రాష్ట్రంలో జూన్‌ 5వ తేదీన ప్రారంభమైన పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 12వ తేదీ వరకు జరిగాయి. ఈ పరీక్షలకుమొత్తం 31,542 మంది పరీక్ష ఫీజు చెల్లించగా.. ఇందులో 17,768 మంది మాత్రమే అంటే 56.33 శాతం మంది హాజరయ్యారు. రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్ధులతో పాటు, మార్కులు తక్కువగా వచ్చి స్కోర్ పెంచుకోవాలనుకున్న వారు ఇంప్రూవ్‌మెంట్‌ కోసం ఈ పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు అడ్మిషన్ల కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు విద్యాశాఖ కేవలం 12 రోజుల్లోనే సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేసి ఫలితాలను సిద్ధం చేసింది. మరో వైపు ఇప్పటికే తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను కూడా సర్కార్‌ విడుదల చేసింది.

Follow Us