
హైదరాబాద్, మే 10: తెలంగాణ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 (టీజీ ఈసెట్) మరో 5 రోజుల్లోనే జరగనుంది. ఈ క్రమంలో పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఉన్నత విద్యామండలి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసినట్లు ప్రకటన జారీ చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్, హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక తెలంగాణ ఈసెట్ పరీక్ష మే 15, 2026వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతీయ కేంద్రాల పరిధిలో మొత్తం 80 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఈసెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు పరీక్ష కేంద్రానికి హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా తమ వెంట తెచ్చుకోవాలి. పరీక్ష ప్రారంభ సమయానికి కనీసం గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, సెల్ ఫోన్, వాచ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
తెలంగాణ ఈసెట్ 2026 హాల్ టికెట్ల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణలో టీచర్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఎడ్‌సెట్ 2026 హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు విద్యాశాఖ అడ్మిట్ కార్డులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 12న రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్ష జరగనుంది. ఎడ్ సెట్ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్నాయి.
టీజీ ఎడ్‌సెట్ 2026 హాల్ టికెట్ల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.