TGSRTC Admissions 2025: నిరుద్యోగులకు అలర్ట్.. తెలంగాణ ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల! చివరి తేదీ ఇదే

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) హైదరాబాద్, వరంగల్‌లోని TGSRTC ఐటీఐ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి వివిధ ట్రేడ్‌లలో ప్రవేశానికి ఆసక్తిగల విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. మోటార్ మెకానిక్ వెహికల్, మెకానిక్ డీజిల్, వెల్డర్, పెయింటర్ విభాగాల్లో అడ్మిషన్లు కల్పిస్తున్నారు..

TGSRTC Admissions 2025: నిరుద్యోగులకు అలర్ట్.. తెలంగాణ ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల! చివరి తేదీ ఇదే
TGSRTC ITI Admissions

Updated on: Jun 04, 2025 | 4:46 PM

హైదరాబాద్‌, జూన్‌ 4: ఐటీఐ విద్యనభ్యసించే వారికి తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌, వరంగల్‌లోని ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి తెలంగాణ ఆర్టీసీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మోటార్‌ మెకానిక్‌ వెహికిల్‌, మెకానిక్‌ డిజిల్‌, వెల్డర్‌, పెయింటర్‌ ట్రెడ్‌లలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ప్రకటన జారీ చేశారు. ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టీజీఎస్‌ఆర్టీసీ డిపోల్లో అప్రెంటీషిఫ్‌ సౌకర్యం కల్పిస్తుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 21, 2025వ తేదీలోపు అధికారిక వెబ్ సైట్‌లో ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఐటీఐ మంచి అవకాశం. నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, బంగారు భవిష్యత్‌ అందించడంతో పాటు తక్కువ వ్యవధిలో ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఐటీఐ కళాశాలలను టీజీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు హైదరాబాద్‌ లోని హాకీంపేట, వరంగల్ ములుగు రోడ్ లోని ఐటీఐ కళాశాలలను నేరుగా సంప్రదించవచ్చని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

నిరుద్యోగ యువతకు మంచి శిక్షణ, బంగారు భవిష్యత్తు అందించడం, తక్కువ సమయంలోనే ఉపాధి కల్పించడం అనే లక్ష్యంతో ఆర్టీసీ ఈ ఐటీఐ కళాశాలలను ఏర్పాటు చేసింది. నిపుణులైన అధ్యాపకులతో పాటు అత్యంత అనుభవజ్ఞులైన అధికారులు తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కావలసిన TGSRTC డిపోలలో అప్రెంటిస్‌షిప్ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వారు తెలిపారు. ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు పూర్తి వివరాల కోసం హైదరాబాద్ ఐటీఐ కళాశాల ఫోన్ నంబర్లు 9100664452 లేదా 040-23450033, వరంగల్ ఐటీఐ కళాశాల ఫోన్ నంబర్లు 9849425319 లేదా 8008136611 సంప్రదించవచ్చు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us