TG RJC CET 2026 Exam Date: మరో 2 రోజుల్లో తెలంగాణ ఆర్‌జేసీ సెట్‌ 2026 పరీక్ష.. హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ లింక్

గురుకుల విద్యాలయాలు, కేజీబీవీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్‌ ఇంగ్లిష్‌ మీడియంలో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఆర్‌జేసీ సెట్ 2026 పరీక్ష హాల్‌ టికెట్లను గురుకుల విద్యాలయాల సంస్థ విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ మొబైల్‌ నంబర్‌ లేదా ఐడీ, పుట్టిన తేదీ..

TG RJC CET 2026 Exam Date: మరో 2 రోజుల్లో తెలంగాణ ఆర్‌జేసీ సెట్‌ 2026 పరీక్ష.. హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ లింక్
TS RJC CET Exam Hall Tickets

Updated on: May 01, 2026 | 6:36 AM

హైదరాబాద్‌, మే 1: తెలంగాణ గురుకుల విద్యాలయాలు, కేజీబీవీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్‌ ఇంగ్లిష్‌ మీడియంలో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఆర్‌జేసీ సెట్ 2026 పరీక్ష హాల్‌ టికెట్లను గురుకుల విద్యాలయాల సంస్థ విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ మొబైల్‌ నంబర్‌ లేదా ఐడీ, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా తెలంగాణ ఆర్‌జేసీ సెట్‌-2026 పరీక్ష మే 3న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 317 కేంద్రాల్లో నిర్వహించనున్నారు.

https://tgrjc.cgg.gov.in/TGRJCWEB/

ప్రవేశ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మెరిట్ మార్కులు, రిజర్వేషన్‌ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ప్రవేశాల కోసం సీట్ల కేటాయింపు కు 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను కౌన్సెలింగ్‌కు పిలుస్తారు. తెలంగాణ ఆర్‌జేసీ సెట్‌ 2026 మొదటి దశ ప్రవేశాలు మే 4వ వారంలో జరుగుతాయి. ఈ కింది డైరెక్ట్‌ లింక్‌ ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోండి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ఆర్‌జేసీ సెట్‌-2026 హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఎన్టీపీసీ (యూజీ) మాక్‌ టెస్టులు రాసేయండి.. వచ్చే నెల్లోనే పరీక్షలు

ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ (UG) విభాగంలోని 3,058 పోస్టుల భర్తీకి సంబంధించి మే నుంచి జూన్‌ వరకు ఆన్‌లైన్‌ సీబీటీ 1 పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి అధికారికంగా మాక్ టెస్టులను తాజాగా ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. అభ్యర్థులు రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఈ మాక్ టెస్టులను ఉచితంగా రాయొచ్చు. సీబీటీ-1 పరీక్షలను మొత్తం మూడు దశల్లో మే నుంచి జూన్ వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు.

ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ (యూజీ) మాక్‌ టెస్టుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us