TG PECET 2026 Registration: పీఈసెట్‌ దరఖాస్తు గడువు పెరిగిందోచ్‌.. ఆలస్య రుసుములేకుండా మరో 10 రోజుల వరకు ఛాన్స్!.

రాష్ట్రంలోని వ్యాయామ విద్యా కోర్సుల్లో 2026-27 విద్యాసంవత్సారానికి ప్రవేశాలకు నిర్వహించే టీజీ పీఈసెట్‌ 2026 దరఖాస్తు గడువును తెలంగాణ ఉన్నత విద్యా మండలి పొడిగించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు మే 5, 2026వ తేదీతో దరఖాస్తు (ఆలస్య రుసుము లేకుండా) గడువు ముగిసింది. తాజాగా ఈ గడువును..

TG PECET 2026 Registration: పీఈసెట్‌ దరఖాస్తు గడువు పెరిగిందోచ్‌.. ఆలస్య రుసుములేకుండా మరో 10 రోజుల వరకు ఛాన్స్!.
TG PECET application deadline extended

Updated on: May 06, 2026 | 4:36 PM

హైదరాబాద్‌, మే 6: తెలంగాణ రాష్ట్రంలోని వ్యాయామ విద్యా కోర్సుల్లో 2026-27 విద్యాసంవత్సారానికి ప్రవేశాలకు నిర్వహించే టీజీ పీఈసెట్‌ 2026 దరఖాస్తు గడువును తెలంగాణ ఉన్నత విద్యా మండలి పొడిగించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు మే 5, 2026వ తేదీతో దరఖాస్తు (ఆలస్య రుసుము లేకుండా) గడువు ముగిసింది. అయితే ఈ గడువును మే 15, 2026వ తేదీ వరకు పొడిగించడంతో మరో 10 రోజుల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లభించినట్లైంది. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ఈ గడువును పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది.

కాగా టీజీ పీఈసెట్‌ 2026లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ వ్యాయామ విద్యా కాలేజీల్లో రెండేళ్ల బీపీఈడీ (BPEd), డీపీఈడీ (DPEd) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కోర్సుల్లో చేరాలనుకునే వారు ముగింపు సమయంలోగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో ఈ కింది డైరెక్ట్‌ లింక్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. రెండేళ్ల బీపీఈడీ కోర్సులో చేరాలంటే ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే వయసు జులై 1, 2026 నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి. డీపీఈడీ కోర్సుకు ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణతతోపాటు విద్యార్హతతోపాటు జులై 1, 2026 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి.

ఈ అర్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.900, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు రూ.500 చొప్పున రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రూ.500, రూ.2 వేలు ఆలస్య రుసుముతో మే 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఫిజికల్‌ ఎఫిషియన్సీ అండ్‌ స్కిల్‌ టెస్ట్‌లు మే 31 నుంచి జూన్ 3, 2026వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఫలితాలు జూన్‌ 6, 2026న ప్రకటిస్తారు.

ఇవి కూడా చదవండి

టీఎస్‌ పీఈసెట్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us