TG ECET 2026 Hall Tickets: ఇంకా కొనసాగుతున్న ఈసెట్ దరఖాస్తు ప్రక్రియ.. రేపట్నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్

తెలంగాణ ఈసెట్ 2026 పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు శనివారం (మే 9) విడుదలకానున్నాయి. ఈసెట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు రేపు ఉదయం 11 గంటల నుంచి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ ఓ ప్రకటనలో..

TG ECET 2026 Hall Tickets: ఇంకా కొనసాగుతున్న ఈసెట్ దరఖాస్తు ప్రక్రియ.. రేపట్నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్
TS ECET Hall Tickets

Updated on: May 08, 2026 | 2:51 PM

హైదరాబాద్‌, మే 8: బీఈ, బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాదిలో చేరడానికి నిర్వహించే తెలంగాణ ఈసెట్ 2026 పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు శనివారం (మే 9) విడుదలకానున్నాయి. ఈసెట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు రేపు ఉదయం 11 గంటల నుంచి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. డిప్లొమా, బీఎస్సీ (గణితం)కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు నేరుగా బీటెక్ రెండో సంవత్సరంలో ప్రవేశించేందుకు నిర్వహించే యేటా ఈసెట్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఈసెట్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 18,637 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ఇక ఈసెట్ పరీక్ష మే 15వ తేదీన నిర్వహించనున్నారు. ఈ రోజున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16 ప్రాంతీయ కేంద్రాల పరిధిలో మొత్తం 80 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు ఈసెట్‌కు దరఖాస్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు మే 12వ తేదీ వరకు అవకాశం కల్పించారు. రూ. 5,000 ఆలస్య రుసుముతో మే 9, 10 తేదీల వరకు, రూ.10,000 ఆలస్య రుసుముతో మే 11, 12 తేదీల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

విద్యార్ధులు హాల్‌టికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అందులోని పేరు, ఫొటో వంటి వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే మరోమారు హాల్‌ టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. పరీక్ష రోజున హాల్‌ టికెట్‌తోపాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక ఒరిజినల్ ఫొటో ఐడెంటిటీ కార్డును తప్పనిసరిగా తమ వెంట తెచ్చుకోవాలని కన్వీనర్‌ సూచించారు. పరీక్ష ప్రారంభ సమయానికి కనీసం గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవల్సి ఉంటుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. మొబైల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, వాచ్‌ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. వీటితోపాటు హాల్‌ టికెట్లపై సూచించిన ఇతర సూచనలు తప్పక పాటించవల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

https://ecet.tgche.ac.in/

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us