AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు మరో 3 ఏళ్లు వయో సడలింపు!

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని మరో మూడేళ్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటికే ఉన్న ఏడేళ్ల వయోపరిమితి సడలింపునకు అదనంగా మరో మూడేళ్లు కలవడంతో.. మొత్తం 10 ఏళ్ల వరకు వయో సడలింపు అందుబాటులోకి వచ్చింది..

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు మరో 3 ఏళ్లు వయో సడలింపు!
Constable Age Limit Extended
Srilakshmi C
|

Updated on: Sep 10, 2026 | 7:20 AM

Share

హైదరాబాద్‌, సెప్టెంబర్ 10:  తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) చేపట్టే నియామకాలకు ఈ అదనపు వయో సడలింపు వర్తించనుంది. పోలీస్ శాఖతో పాటు ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) విభాగాల్లోని కానిస్టేబుల్ పోస్టులకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. కానిస్టేబుల్‌తో సమాన హోదా కలిగిన ఇతర పోస్టులకు కూడా ఈ అదనపు సడలింపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటివరకు తెలంగాణలో ఎస్సై ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితి 32 సంవత్సరాలు, కానిస్టేబుల్ పోస్టులకు 29 సంవత్సరాలుగా ఉండేది. దీంతో రెండు పోస్టుల మధ్య వయోపరిమితిలో వ్యత్యాసంపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎస్సై అభ్యర్థులతో సమానంగా కానిస్టేబుల్ అభ్యర్థుల వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఎవరికి ప్రయోజనం?

వయోపరిమితి కారణంగా గతంలో పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేకపోయిన పలువురు అభ్యర్థులకు తాజా నిర్ణయం ప్రయోజనం చేకూర్చనుంది. ముఖ్యంగా చాలా కాలంగా పోలీస్ నియామకాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ఊరటనివ్వనుంది. రాబోయే నియామకాల్లో మరింత మంది అభ్యర్థులు పోటీ పడేందుకు అవకాశం ఏర్పడింది. అయితే ఈ అదనపు మూడేళ్ల వయో సడలింపుకు ప్రభుత్వం కొన్ని మినహాయింపులు విధించింది. పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులకు ఈ అదనపు సడలింపు వర్తించదు. కాబట్టి డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా పోస్టులకు సంబంధించిన ప్రత్యేక వయోపరిమితి నిబంధనలను పరిశీలించాల్సి ఉంటుంది.

ఈ వయోపరిమితి పెంపునకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 2026 సెప్టెంబర్ 9న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈ ఉత్తర్వులను విడుదల చేసినట్లు పేర్కొంది. ఇప్పటికే అమల్లో ఉన్న ఏడేళ్ల సడలింపునకు మరో మూడేళ్లు కలపడంతో మొత్తం పదేళ్ల వరకు వయో సడలింపు లభించనుంది. అభ్యర్థులు రాబోయే పోలీస్ నియామక నోటిఫికేషన్‌ విడుదలైనప్పుడు అందులో పేర్కొన్న వయస్సు, విద్యార్హతలు, శారీరక ప్రమాణాలు, ఇతర అర్హతలు తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు. వయో సడలింపు వర్తించినప్పటికీ ఇతర అర్హతలను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

Follow Us
గుడ్‌న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు మరో 3 ఏళ్లు వయో సడలింపు!
గుడ్‌న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు మరో 3 ఏళ్లు వయో సడలింపు!
టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం
టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం
పొద్దున్నే ఒక గుడ్డు తింటే 100 ఏనుగుల బలం.. పెంకు ఈజీగా రావాలంటే
పొద్దున్నే ఒక గుడ్డు తింటే 100 ఏనుగుల బలం.. పెంకు ఈజీగా రావాలంటే
డెలివరీ బాయ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..
డెలివరీ బాయ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..
త్రిగుణ్ ఆ బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్‌కు దగ్గరి బంధువా?
త్రిగుణ్ ఆ బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్‌కు దగ్గరి బంధువా?
టీమిండియాలో సడన్ ఎంట్రీ.. అసలెవరీ నచికేత్ భూటే
టీమిండియాలో సడన్ ఎంట్రీ.. అసలెవరీ నచికేత్ భూటే
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..
ఉదయభాను నిర్మించిన క్రైమ్ థ్రిల్లర్.. మరికొన్ని గంటట్లో ఓటీటీలోకి
ఉదయభాను నిర్మించిన క్రైమ్ థ్రిల్లర్.. మరికొన్ని గంటట్లో ఓటీటీలోకి
కుప్పకూలిన బంగారం ధరలు.. కొనాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్..
కుప్పకూలిన బంగారం ధరలు.. కొనాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్..
16 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఛోటా ప్యాకెట్.. అదేంటంటే?
16 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఛోటా ప్యాకెట్.. అదేంటంటే?