TG DEECET 2026: తెలంగాణ డీఈఈసెట్‌ 2026 నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌.. దరఖాస్తులు ఎప్పట్నుంచంటే?

2026-27 విద్యా సంవత్సరానికి రెండేళ్ల డీఈఎల్‌ఈడీ, డీపీఎస్‌ఈ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (డీఈఈసెట్‌ 2026) నోటిఫికేషన్‌ను స్టేట్‌ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తాజాగా విడుదల చేసింది. టీచర్‌ కొలువుల్లో స్థిరపడాలని భావించే వారు..

TG DEECET 2026: తెలంగాణ డీఈఈసెట్‌ 2026 నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌.. దరఖాస్తులు ఎప్పట్నుంచంటే?
Telangana DEECET Notification

Updated on: Mar 01, 2026 | 3:10 PM

తెలంగాణ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి రెండేళ్ల డీఈఎల్‌ఈడీ, డీపీఎస్‌ఈ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (డీఈఈసెట్‌ 2026) నోటిఫికేషన్‌ను స్టేట్‌ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తాజాగా విడుదల చేసింది. టీచర్‌ కొలువుల్లో స్థిరపడాలని భావించే వారు ఈ కోర్సులు చేయవల్సి ఉంటుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే డీఈఈసెట్‌లో తప్పనిసరిగా ర్యాంకు సాధించవల్సి ఉంటుంది. ఇందులో వచ్చి ర్యాంకు ఆధారంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డైట్‌, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యకేషన్‌ కాలీజేల్లో మైనారిటీ, నాన్ మైనారిటీతో సహా అన్ని వర్గాల వారికి ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన మార్చి 15, 2026వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీఈఈఈసెట్‌) 2026కు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఎలాంటి వయోపరిమితి ఉండదు. అర్హత కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్ 15, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్ధులు రూ.500, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీఎస్‌ అభ్యర్థులు రూ.450 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.

డీఈఈఈసెట్‌ 2026 ప్రవేశ పరీక్షలు మే 21, 22 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. డీఈఈఈసెట్‌లో సాధించిన ర్యాంకు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా కౌన్సెలింగ్‌ నిర్వహించి డీఈఎల్‌ఈడీ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) లేదా డీపీఎస్‌ఈ (డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్)లో సీటు కేటాయిస్తారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ డీఈఈఈసెట్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us