తెలంగాణలో 264 అంగన్‌వాడీ ఉద్యోగాలు.. అప్లై చేసేందుకు మరో 2 రోజులే గడువు!

వికారాబాద్ జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్, ఆయా పోస్టుల భర్తీకి మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లా సంక్షేమాధికారి పరిధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో మొత్తం 264 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు..

తెలంగాణలో 264 అంగన్‌వాడీ ఉద్యోగాలు.. అప్లై చేసేందుకు మరో 2 రోజులే గడువు!
Telangana Anganwadi Recruitment

Updated on: Oct 22, 2026 | 3:11 PM

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళల కోసం.. వికారాబాద్ జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్, ఆయా పోస్టుల భర్తీకి మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లా సంక్షేమాధికారి పరిధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో మొత్తం 264 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు 2026 అక్టోబర్ 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వికారాబాద్ జిల్లా పరిధిలోని కోడంగల్, మర్పల్లి, పరిగి, తాండూరు, వికారాబాద్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు. మొత్తం పోస్టుల్లో 102 అంగన్‌వాడీ టీచర్ పోస్టులు, 162 అంగన్‌వాడీ ఆయా పోస్టులు ఉన్నాయి.

వికారాబాద్ జిల్లా అంగన్వాడీ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రాజెక్టుల వారీగా ఖాళీలు ఇలా..

ఐసీడీఎస్ ప్రాజెక్టు టీచర్ పోస్టులు ఆయా పోస్టులు మొత్తం
కోడంగల్ 13 31 44
మర్పల్లి 21 14 35
పరిగి  27 78 105
తాండూరు  23 28 51
వికారాబాద్  18 11 29
మొత్తం  102 162 264

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేని సందర్భంలో, పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులను తదుపరి పరిగణనలోకి తీసుకుంటారు. ఇతర అర్హతలు, వయోపరిమితి, స్థానికత వంటి నిబంధనలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి. అర్హులైన మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో అవసరమైన వివరాలను సరిగ్గా నమోదు చేసి, సంబంధిత ధ్రువీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అభ్యర్థులు 2026 అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 వరకు తమ దరఖాస్తు ప్రతితో పాటు ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ ప్రతులను సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించాలి. నిబంధనల ప్రకారం జిల్లా కలెక్టర్ లేదా సంబంధిత చైర్మన్ నేతృత్వంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు, మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 10 అక్టోబర్ 2026
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24 అక్టోబర్ 2026
  • ధ్రువీకరణ పత్రాల సమర్పణ: 26 అక్టోబర్ నుంచి 1 నవంబర్ 2026 వరకు

వికారాబాద్ జిల్లా పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేయాలనుకునే అర్హులైన మహిళలకు ఈ నియామకాలు మంచి అవకాశం. దరఖాస్తు గడువు 2026 అక్టోబర్ 24తో ముగియనున్నందున, చివరి రోజు వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడం మంచిది. దరఖాస్తు విధానం, అర్హతలు, ఇతర నిబంధనలపై పూర్తి వివరాల కోసం సంబంధిత శాఖ అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించాలి.

వికారాబాద్ జిల్లా అంగన్వాడీ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us