Govt Jobs 2026: డిగ్రీ పాసైన వారికి 12,256 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షన్నర జీతం

SSC CGL 2026 Notification: దేశంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ విభాగాల కార్యాలయాల్లో గ్రూప్‌ బి, గ్రూప్‌ సి పోస్టుల భర్తీకి కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఎగ్జామ్‌ (సీజీఎల్‌ఈ) 2026 నోటిఫికేషన్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ కింద దాదాపు 12,256 పోస్టులను భర్తీ

Govt Jobs 2026: డిగ్రీ పాసైన వారికి 12,256 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షన్నర జీతం
SSC CGL Job Notification

Updated on: May 26, 2026 | 6:31 AM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) గుడ్‌న్యూస్‌ చెప్పింది. దేశంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ విభాగాల కార్యాలయాల్లో గ్రూప్‌ బి, గ్రూప్‌ సి పోస్టుల భర్తీకి కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఎగ్జామ్‌ (సీజీఎల్‌ఈ) 2026 నోటిఫికేషన్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ కింద దాదాపు 12,256 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీలో పాసైతే చాలు. ఆసక్తి కలిగిన వారు జూన్‌ 22వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనున్న అసిస్టెంట్‌ ఆడిట్ ఆఫీసర్‌ (సెంట్రల్‌ క్యాడర్‌, స్టేట్‌ క్యాడర్‌), అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులకు డిగ్రీతో పాటు కొన్ని ప్రత్యేక అర్హతలు ఉండాలి. ఇందులో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు 12వ తరగతి స్థాయిలో గణితంలో 60 శాతం మార్కులు ఉండాలి. లేదా డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా ఉండాలి. అలాగే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 పోస్టులకు స్టాటిస్టిక్స్, గణితం, ఎకనామిక్స్ సబ్జెక్టులలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్ట్ 1, 2026వ తేదీ నాటికి ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయసు ఆగస్ట్‌ 1, 2026 నాటికి పోస్టులను బట్టి వయోపరిమితి 18 నుంచి 27 ఏళ్లు, 20 నుంచి 30 ఏళ్లు, 18 నుంచి 30 ఏళ్లు, 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 22, 2026వ తేదీ రాత్రి 11 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుం కింద జనరల్‌ అభ్యర్ధులు రూ.100 చొప్పున చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. టైర్‌ 1, టైర్‌ 2 పరీక్షల ద్వారా భర్తీ చేస్తారు. టైర్‌ 1 (CBT) పరీక్ష ఆగస్టు నుంచి సెప్టెంబర్‌లో, టైర్‌ 2 సీబీటీ పరీక్ష డిసెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉంది. ఎంపికైన వారికి పోస్టులను అనుసరించి నెలకు రూ.25,500 నుంచి రూ.1,51,100 వరకు జీతంగా చెల్లిస్తారు. దరఖాస్తు చేయడంలో ఏవైనా సందేహాలు ఉంటే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 309 3063ను సంప్రదించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us