SSB Constable GD Jobs 2026: టెన్త్‌ అర్హతతో సశస్త్ర సీమా బల్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు

సశస్త్ర సీమా బల్ (SSB) స్పోర్ట్స్ కోటా కింద జనరల్ సెంట్రల్‌ సర్వీస్‌లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్‌ సీ నాన్‌ గెజిట్‌ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి 2026 సంవత్సరానికి గానూ అర్హులైన మహిళా, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది..

SSB Constable GD Jobs 2026: టెన్త్‌ అర్హతతో సశస్త్ర సీమా బల్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు
SSB Constable GD Sports Quota Recruitment

Updated on: May 10, 2026 | 4:05 PM

భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్ (SSB).. స్పోర్ట్స్ కోటా కింద జనరల్ సెంట్రల్‌ సర్వీస్‌లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్‌ సీ నాన్‌ గెజిట్‌ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి 2026 సంవత్సరానికి గానూ అర్హులైన మహిళా, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 404 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. పదో తరగతి అర్హతతోపాటు సంబంధిత క్రీడాంశంలో ప్రవేశం ఉన్నవారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు భారతదేశంతోపాటు విదేశాల్లోనూ ఎక్కడైనా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి.

సశస్త్ర సీమా బల్‌లో కానిస్టేబుల్ GD ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెట్రిక్యులేషన్ లేదా పదవ తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఆర్బరీ, అథ్లెటిక్స్, అక్వాటిక్స్‌ (స్విమ్మింగ్), బాక్సింగ్, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్, సైక్లింగ్, ఫెన్సింగ్‌, జిమ్నాస్టిక్స్, ఫుట్‌బాల్, హాకీ, హాండ్‌ బాల్‌, జూడో, కరాటీ, పవర్‌ లిఫ్టింగ్‌, కబడ్డీ, షూటింగ్, వాలీబాల్, యోగాసన, షూటింగ్‌, టేబుల్ టెన్నిస్, వాలీబాల్‌, రెజ్లింగ్‌ వంటి తదితర విభాగాల్లో అంతర్జాతీయ లేదా జాతీయ స్థాయి పోటీల్లో దేశం లేదా రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించి ఉండాలి. లేదంటే సీనియర్, జూనియర్ జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో మెడల్ సాధించి ఉండాలి. వీరితోపాటు ఖేలో ఇండియా గేమ్స్ మెడలిస్టులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయోపరిమితి తప్పనిసరిగా 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపులు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 7, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులు రూ.100 చొప్పున చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రుసుము నుంచి మినహాయింపు ఉంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే క్రీడాంశాల్లో ప్రతిభ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతంతోపాటు ఇతర అలవెన్స్‌లు కల్పిస్తారు.

సశస్త్ర సీమా బల్‌లో కానిస్టేబుల్ GD ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us