Railway Jobs 2025: నిరుద్యోగులకు అలర్ట్‌.. దక్షిణ రైల్వేలో 3518 ఉద్యోగాలు! రాత పరీక్షలేకుండానే ఎంపిక

దక్షిణ రైల్వేలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న యాక్ట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 3518 యాక్ట్‌ అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిట్టర్‌, వెల్డర్‌, పెయింటర్‌, ఎంఎల్‌టీ, కార్పెంటర్‌, ఎంఎంవీ, ఎంఎంటీఎం, మెషినిస్ట్‌, టర్నర్‌, ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌..

Railway Jobs 2025: నిరుద్యోగులకు అలర్ట్‌.. దక్షిణ రైల్వేలో 3518 ఉద్యోగాలు! రాత పరీక్షలేకుండానే ఎంపిక
Southern Railway Jobs

Updated on: Aug 28, 2025 | 8:52 AM

దక్షిణ రైల్వే.. చెన్నైలోని రైల్వే రీజియన్లలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న యాక్ట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 3518 యాక్ట్‌ అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిట్టర్‌, వెల్డర్‌, పెయింటర్‌, ఎంఎల్‌టీ, కార్పెంటర్‌, ఎంఎంవీ, ఎంఎంటీఎం, మెషినిస్ట్‌, టర్నర్‌, ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌, వైర్‌మెన్‌ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్‌ 26, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి.

విభాగాల వారీగా ఖాళీల వివరాలు..

  • అప్రెంటిస్‌- క్యారేజ్‌ & వ్యాగన్‌ వర్క్స్‌, పెరంబూర్‌లో ఖాళీల సంఖ్య: 1394
  • సెంట్రల్‌ వర్క్‌షాప్‌, గోల్డెన్‌ రాక్‌లో ఖాళీల సంఖ్య: 857
  • సిగ్నల్‌ అండ్ టెలికమ్‌ వర్క్‌షాప్‌ యూనిట్స్‌, పొడనూర్‌లో ఖాళీల సంఖ్య: 1267

పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్‌, పదో తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణత పొందినవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అభ్యర్ధుల వయోపరిమితి తప్పనిసరిగా 2025 జనవరి 1వ తేదీ నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 26, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.100 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. విద్యార్హతల్లో సాధించిన మెరిట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. నెలకు రూ. 6000 నుంచి రూ.7000 వరకు స్టైపెండ్‌ చెల్లిస్తారు.

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us