SBI Bank Jobs 2025: ఎలాంటి రాత పరీక్షలేకుండానే ఎస్‌బీఐలో ఆఫీసర్‌ ఉద్యోగాలు.. ఎంపికైతే లక్షల్లో జీతం

SBI SCO Recruitment 2025 Notification Out for 103 Posts: దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ (SCO) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్‌ 27వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు..

SBI Bank Jobs 2025: ఎలాంటి రాత పరీక్షలేకుండానే ఎస్‌బీఐలో ఆఫీసర్‌ ఉద్యోగాలు.. ఎంపికైతే లక్షల్లో జీతం
SBI Specialist Cadre Officer Jobs

Updated on: Oct 28, 2025 | 3:33 PM

స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI).. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ (SCO) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్‌ 27వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 103 హెడ్‌ (ప్రొడక్ట్‌, ఇన్వెస్ట్‌మెంట్ అండ్‌ రిసెర్చ్‌), జోనల్ హెడ్‌ (రిటైల్‌), ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ తదితర పోస్టులను భర్తీ చేయనుంది. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

పోస్టుల వివరాలు ఇలా..

  • హెడ్‌ (ప్రొడక్ట్‌, ఇన్వెస్ట్‌మెంట్ అండ్‌ రిసెర్చ్‌) పోస్టుల సంఖ్య: 1
  • జోనల్ హెడ్‌ (రిటైల్‌) పోస్టుల సంఖ్య: 4
  • రిజినల్ హెడ్‌ పోస్టుల సంఖ్య: 7
  • రిలేషన్‌షిప్‌ మేనేజర్‌-టీమ్‌ లీడర్‌ పోస్టుల సంఖ్య: 19
  • ఇన్వెస్ట్‌మెంట్‌ స్పెషలిస్ట్‌ (ఐఎస్‌) పోస్టుల సంఖ్య: 22
  • ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ (ఓ) పోస్టుల సంఖ్య: 46
  • ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ (బిజినెస్‌) పోస్టుల సంఖ్య: 2
  • సెంట్రల్‌ రిసెర్చ్‌ టీమ్‌ (సపోర్ట్‌) పోస్టుల సంఖ్య: 2

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, సీఏ/సీఎఫ్‌ఏ/సీఎఫ్‌పీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా, పీజీడీఎంలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి మే 5, 2025వ తేదీ నాటికి వివిధ విభాగాల్లోని పోస్టులను అనుసరించి 25 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 17, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.750 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. అలాగే ఎలాంటి రాత పరీక్షలేకుండానే కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఇతర వివరాలను ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us