
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. దేశ వ్యాప్తంగా ఉన్న తన బ్రాంచుల్లో క్లర్క్ కేడర్‌లో జూనియర్ అసోసియేట్ (Customer Support & Sales) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద దేశవ్యాప్తంగా మొత్తం 9,766 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో 7,680 రెగ్యులర్ ఖాళీలు, 2,086 బ్యాక్‌లాగ్ ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలో 260 రెగ్యులర్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 31, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 2026 డిసెంబరు 31 నాటికి డిగ్రీ పూర్తి కావాలి. ఫైనల్ ఇయర్/సెమిస్టర్ విద్యార్థులు కూడా తాత్కాలిక ప్రాతిపదికన దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎంపికైన వారు 31-12-2026లోపు డిగ్రీ ఉత్తీర్ణతకు సంబంధించిన ఆధారాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్ధుల వయోపరిమితి 026 ఏప్రిల్ 1 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. అంటే ఏప్రిల్ 2, 1998 నుంచి ఏప్రిల్ 1, 2006 మధ్య జన్మించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్-సర్విస్‌మెన్ తదితర రిజర్వేషన్ కేటగిరీలకు నిబంధనల ప్రకారం గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఆగస్ట్ 31, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.750 చొప్పున చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్-సర్విస్‌మెన్ అభ్యర్ధులకు ఎలాంటి ఫీజు లేదు. మూడు దశల్లో ఎంపిక ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (LLPT) ద్వారా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి జూనియర్ అసోసియేట్ పోస్టుకు పే స్కేల్ నెలకు రూ.24,050 నుంచి రూ.64,480 వరకు జీతంగా చెల్లిస్తారు. ఉంటుంది. దీనితోపాటు డీఏ, ఇతర అలవెన్సులు కలిపి అందిస్తారు. ముంబయి వంటి మెట్రో నగరాల్లో ప్రారంభ మొత్తం వేతనం నెలకు సుమారు రూ.46,000 వరకు ఉండొచ్చు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లార్క్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.