AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైల్వే జాబ్ ఆశావహులకు బిగ్ అప్‌డేట్.. హాల్ టికెట్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల కోసం నిర్వహించనున్న CBT-2 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. CBT-1లో అర్హత సాధించిన అభ్యర్థులు తమ సంబంధిత ప్రాంతీయ RRB అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

రైల్వే జాబ్ ఆశావహులకు బిగ్ అప్‌డేట్.. హాల్ టికెట్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
Rrb Ntpc Ug Cbt 2 ExamImage Credit source: AI Image
Balaraju Goud
|

Updated on: Sep 14, 2026 | 5:10 PM

Share

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల కోసం నిర్వహించనున్న CBT-2 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. CBT-1లో అర్హత సాధించిన అభ్యర్థులు తమ సంబంధిత ప్రాంతీయ RRB అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. RRB NTPC UG CBT-2 పరీక్షను 2026 సెప్టెంబర్ 17న నిర్వహించనున్నారు. RRB నిబంధనల ప్రకారం, అభ్యర్థులు తమ ఈ-కాల్ లెటర్‌ను సంబంధిత RRB వెబ్‌సైట్‌ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాలి. పరీక్ష కేంద్రం, తేదీ, షిఫ్ట్ వంటి వివరాలు ఈ-కాల్ లెటర్‌లోనే ఉంటాయి.

ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

ముందుగా సంబంధిత ప్రాంతీయ RRB అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం CEN No. 07/2025 NTPC UG విభాగంలోకి వెళ్లాలి. అక్కడ కనిపించే E-Call Letter/Admit Card లింక్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత లాగిన్ పేజీలో రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా వంటి వివరాలను నమోదు చేయాలి. లాగిన్ అయిన తర్వాత హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దాని ప్రింట్ తీసుకోవడం మంచిది. RRB ప్రకారం ఈ-కాల్ లెటర్లు పోస్టు ద్వారా పంపించరు. అభ్యర్థులు తమ ప్రాంతీయ RRB వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా పరిశీలించాలని సూచించింది.

హాల్ టికెట్‌లో వివరాలు చెక్ చేయండి

అడ్మిట్ కార్డు చేతికి వచ్చిన వెంటనే అభ్యర్థులు అందులోని వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. పేరు, రిజిస్ట్రేషన్ నంబర్, ఫోటో, సంతకం, పరీక్ష తేదీ, షిఫ్ట్, పరీక్ష కేంద్రం చిరునామా తదితర వివరాలను సరిచూసుకోవాలి. ఏదైనా తప్పు కనిపిస్తే పరీక్షకు ముందే సంబంధిత RRB అధికారులను సంప్రదించడం మంచిది.

పరీక్షకు ఏం తీసుకెళ్లాలి?

పరీక్ష రోజున అడ్మిట్ కార్డు/ఈ-కాల్ లెటర్‌తో పాటు చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ ఫొటో ఐడీ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలను ఉపయోగించవచ్చు. అభ్యర్థులు ఈ-కాల్ లెటర్‌లో ఇచ్చిన అన్ని సూచనలను ముందుగానే చదివి పాటించాలి. ముఖ్యంగా, ఈ-కాల్ లెటర్‌లో పేర్కొన్న పరీక్ష కేంద్రం, తేదీ, షిఫ్ట్‌నే తుది వివరాలుగా పరిగణిస్తారు. పరీక్ష కేంద్రం లేదా తేదీ మార్పు కోసం అభ్యర్థుల నుంచి వచ్చే అభ్యర్థనలను RRB సాధారణంగా పరిగణించదని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.

అందువల్ల అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా హాల్ టికెట్‌ను ముందుగానే డౌన్‌లోడ్ చేసుకుని, పరీక్ష కేంద్రానికి చేరుకునే మార్గాన్ని కూడా ముందుగానే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. సెప్టెంబర్ 17న జరిగే CBT-2 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఇప్పుడు అడ్మిట్ కార్డులోని ప్రతి వివరాన్ని మరోసారి చెక్ చేసుకోవాలి.

మరిన్ని కెరీర్ & ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us