RGUKT Basara Recruitment 2022: తెలంగాణలోని బాసర ఆర్జీయూకేటీలో పీఈటీ ఉద్యోగాలు..ఎవరు అర్హులంటే..

|

Jun 24, 2022 | 7:52 AM

తెలంగాణ రాష్ట్రానికి చెందిన బాసర రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (TS RGUKT).. ఒప్పంద ప్రాతిపదికన ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ (Physical Educational Ttrainer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన..

RGUKT Basara Recruitment 2022: తెలంగాణలోని బాసర ఆర్జీయూకేటీలో పీఈటీ ఉద్యోగాలు..ఎవరు అర్హులంటే..
Rgukt Basara
Follow us on

RGUKT Basara Physical Education Trainer (PET) Recruitment 2022: తెలంగాణ రాష్ట్రానికి చెందిన బాసర రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (TS RGUKT).. ఒప్పంద ప్రాతిపదికన ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ (Physical Educational Ttrainer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 4

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ పోస్టులు

పే స్కేల్‌: నెలకు రూ.17,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లేదా స్టేట్‌ లెవల్‌ క్రీడాపోటీల్లో పాల్గొని ఉండాలి/ఎన్‌సీసీ-సీ సర్టిఫికేట్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 2, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.