REC Power Development Recruitment: ఆర్ఈసీ పవర్ డెలప్మెంట్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. భారత ప్రభుత్వ విద్యుచ్ఛక్తి మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థలో కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాలును తీసుకోనున్నారు. నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 29 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులెవరు.? దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడు లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్లో భాగంగా సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ మెటీరియల్ ఇన్స్పెక్షన్, సివిల్, ఎఫ్ అండ్ ఏ, కాంట్రాక్ట్–ప్రొక్యూర్మెంట్ విభాగాల్లో ఖాళీలున్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60శాతం మార్కులతో బీఈ/బీటెక్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. అంతేకాకుండా సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 35ఏళ్ల నుంచి 48ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను మొదట అకడామిక్, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ.62,000 నుంచి 1,35,000 వరకు చెల్లిస్తారు.
* ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 24-08-2021 చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Lovers Death: కారులోనే అగ్నికి ఆహుతైన ప్రేమజంట.. అసలేమైందంటే..?
AP LPCET – 2021: సెప్టెంబర్ 25న ఎల్పీసెట్ ప్రవేశ పరీక్ష.. ఆన్లైన్లోనే దరఖాస్తుల స్వీకరణ..