NTPC Recruitment: ఎంబీబీఎస్ చేసిన వారికి ఎన్‌టీపీసీలో ఉద్యోగాలు.. భారీగా వేత‌నాలు..

| Edited By: Anil kumar poka

Jan 12, 2022 | 8:37 AM

NTPC Recruitment 2022: నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (NTPC) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. న్యూఢిల్లీ కేంద్రంగా ప‌నిచేసే ఈ సంస్థ మెడిక‌ల్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది..

NTPC Recruitment: ఎంబీబీఎస్ చేసిన వారికి ఎన్‌టీపీసీలో ఉద్యోగాలు.. భారీగా వేత‌నాలు..
Follow us on

NTPC Recruitment 2022: నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (NTPC) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. న్యూఢిల్లీ కేంద్రంగా ప‌నిచేసే ఈ సంస్థ మెడిక‌ల్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎవ‌రు అర్హులు.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 15 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో జనరల్‌ సర్జన్‌ (జనరల్‌ సర్జరీ) – 08, స్పెషలిస్ట్‌ (జనరల్‌ మెడిసిన్‌) – 07 ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు ఎంబీబీఎస్ డిగ్రీలో ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. అలాగే సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ (ఎండీ/ డీఎన్‌బీ) త‌ప్ప‌నిస‌రి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఈ4 గ్రేడ్ ఉద్యోగాల‌కు ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ.70,000 నుంచి రూ.2,00,000, ఈ 3 గ్రేడ్‌ అభ్యర్థులకు నెలకి రూ.60,000 నుంచి రూ.1,80,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ 13-01-2022న ప్రారంభం కానుంది.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు చివ‌రి తేదీగా 27-01-2022ని చివ‌రి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి..

Also Read: YS Sharmila: వైఎస్ ష‌ర్మిలకు ఆదిలోనే ఎదురు దెబ్బ‌.. పార్టీ రిజిస్ట్రేష‌న్‌కు అడ్డంకులు..

IND vs SA: 223 పరుగులకే చాప చుట్టేసిన భారత్.. కెప్టెన్ ఇన్నింగ్స్‌ ఆడిన కోహ్లీ..

America Suffers: కరోనా కరాళనృత్యానికి అగ్రరాజ్యం విలవిల.. ప్రపంచ దేశాలకు అమెరికానే ఓ గుణపాఠం