
దేశవ్యాప్తంగా ఉన్న డెంటల్ మెడికల్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ MDS) కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ ఎండీఎస్ 2026 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ పరీక్షల నిర్వహణ బోర్డు NBEMS విడుదల చేసింది. ఈ పరీక్షను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సర్వీసెస్ (NBEMS) ఆధ్వర్యంలో జరగనుంది. నీట్ ఎండీఎస్ 2026లో పొందిన ర్యాంక్ ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ డెంటల్ కాలేజీలు, యూనివర్సిటీల్లో ఓరల్ అండ్ మాక్సిల్లోఫేషియల్ సర్జరీ, కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడొంటిక్స్, ఆర్థోడాంటిక్స్ అండ్ డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్, ప్రోస్టోడాంటిక్స్ అండ్ పీరియాడాంటాలజీ, ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ, పెడోడాంటిక్స్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్రీ, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ, ఓరల్ పాథాలజీ తదితర ఎండీఎస్ స్పెషలైజేషన్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 30, 2026వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నీట్ ఎండీఎస్ 2026కు దరఖాస్తు చేసుకోవాలంటే.. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (బీడీఎస్)లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. బీడీఎస్ డిగ్రీతోపాటు 12 నెలల రొటేటరీ ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. లేదంటే ప్రస్తుతం ఇంటర్న్‌షిప్ చేస్తున్న వారు మే 31, 2026లోపు పూర్తి చేయాలి. అలాగే సంబంధిత స్టేట్ డెంటల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో మార్చి 14, 2026వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రాత పరీక్ష మే 2, 2026వ తేదీన దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు.
నీట్ ఎండీఎస్ 2026 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.