భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన నవోదయ విద్యాలయ సమితి (Navodaya Vidyalaya Samiti).. పీజీటీ, టీజీటీ పోస్టుల (Teaching Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..
NVS Principal, PGT, TGT Recruitment 2022: భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన నవోదయ విద్యాలయ సమితి (Navodaya Vidyalaya Samiti).. పీజీటీ, టీజీటీ పోస్టుల (Teaching Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు:
ప్రిన్సిపల్ పోస్టులకు మాస్టర్స్ డిగ్రీ, బీఈడీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి. అలాగే సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో రెండేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ డిగ్రీ, బీఈడీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
టీజీటీ పోస్టులకు నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, బీఈడీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
ఇతర కేటగిరీ పోస్టులకు గ్రాడ్యుయేషన్, డిప్లొమా (లైబ్రరీ సైన్స్), బీపీఈడీ, డిప్లొమా (ఫైన్ ఆర్ట్స్), బ్యాచిలర్స్ డిగ్రీ (మ్యూజిక్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.