డిగ్రీ, డిప్లొమాతో శ్రీహరికోట ISROలో ఉద్యోగావకాశాలు.. వెంటనే అప్లై చేయండి!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నిరుద్యోగులకు శుభవార్త అందించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC SHAR)లో 400 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిగ్రీ, బీటెక్, డిప్లొమా తదితర అర్హతలు కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంది. ఎంపికైన వారికి నెలకు గరిష్ఠంగా రూ.12,300 స్టైపెండ్ చెల్లిస్తారు. అర్హులైన అభ్యర్థులు 2026 నవంబరు 26లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి..

ప్రభుత్వ రంగ సంస్థలో శిక్షణ పొందాలని ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇస్రో (ISRO) తీపికబురు అందించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC SHAR) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 400 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నియామకాలను అప్రెంటిస్ చట్టం 1961, సవరణ చట్టం 1973 ప్రకారం చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు 2026 నవంబరు 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు
- ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 50 పోస్టులు
- నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 60 పోస్టులు
- టెక్నీషియన్ అప్రెంటిస్ (డిప్లొమా) – 35 పోస్టులు
- డిప్లొమా (DCCP) – 60 పోస్టులు
- ట్రేడ్ అప్రెంటిస్ – 180 పోస్టులు
- ఒకేషనల్ అప్రెంటిస్ – 15 పోస్టులు
సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుంచి డిప్లొమా, బీఎస్సీ, బీకాం, బీఏ, బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. అభ్యర్థులు సంబంధిత విభాగానికి నిర్దేశించిన అర్హతలను కలిగి ఉండాలి. మెకానికల్, ఏరోస్పేస్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కన్స్ట్రక్షన్ ఇంజినీరింగ్ టెక్నాలజీ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నవంబర్ 26, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో అవసరమైన విద్యార్హత ధ్రువపత్రాలు, ఇతర వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి. అభ్యర్థులు విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా కేటగిరీల వారీగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. సంబంధిత విభాగం లేదా ట్రేడ్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఎంపికైన అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో అర్హత సాధించిన వారిని ఎంపిక చేస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి నెలవారీ స్టైపెండ్ చెల్లిస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – రూ.12,300, టెక్నీషియన్ అప్రెంటిస్ – రూ.10,900, ట్రేడ్, ఒకేషనల్ అప్రెంటిస్ – రూ.9,600 చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు మొత్తం 12 నెలల పాటు అప్రెంటిస్ శిక్షణ అందిస్తారు. ఇస్రోలో అప్రెంటిస్ శిక్షణ పొందాలనుకునే అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది. పోస్టుల వారీగా అర్హతలు, దరఖాస్తు విధానం, ఇతర నిబంధనల పూర్తి వివరాల కోసం SDSC SHAR అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ను పరిశీలించాలి.
శ్రీహరికోట ISROలో ఉద్యోగాకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




