
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఆధ్వర్యంలో పనిచేస్తున్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, శ్రీహరికోట (SDSC SHAR) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, సైంటిఫిక్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 97 ఖాళీలకు అర్హులైన భారతీయ పౌరుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2026 నవంబరు 9వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఇస్రో శ్రీహరికోటలో ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. కొన్ని పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ లేదా ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా అవసరం. ప్రతి పోస్టుకు సంబంధించిన నిర్దిష్ట విద్యార్హతలను అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు చొప్పున సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగినవారు ఆన్లైన్ విధానంలో నవంబర్ 9, 2026వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్ట్ కోడ్ 07 నుంచి 15 వరకు రూ.750 ప్రాసెసింగ్ ఫీజు, పోస్ట్ కోడ్ 16 నుంచి 30 వరకు రూ.500 ప్రాసెసింగ్ ఫీజు చొప్పున దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరూ చెల్లించాలి.
రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు వర్తించే నిబంధనల ప్రకారం ఫీజు రీఫండ్ చేస్తారు. ఫీజు చెల్లింపు, రీఫండ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించాలి. అభ్యర్థులను పోస్టును బట్టి వివిధ దశల్లో ఎంపిక చేస్తారు. ప్రధానంగా రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, అవసరమైన పోస్టులకు శారీరక దారుఢ్య పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షల విధానం, అర్హత మార్కులు, ఇతర ఎంపిక నిబంధనలు పోస్టును బట్టి మారవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు రూ.18,000 నుంచి రూ.1,42,400 వరకు జీతం లభిస్తుంది. పోస్టు స్థాయి, పే లెవల్, వర్తించే ఇతర అలవెన్సుల వివరాలను అధికారిక నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు SDSC SHAR అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి సంబంధిత రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను తెరవాలి. సూచించిన విధంగా ఆన్లైన్ దరఖాస్తును పూర్తి చేసి, అవసరమైన వివరాలు నమోదు చేయాలి. ఫీజు వర్తిస్తే చెల్లించి, దరఖాస్తును సమర్పించాలి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ కాపీని భద్రపరచుకోవాలి.
ఇస్రో శ్రీహరికోటలో ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.