Telugu News Education Career Jobs ISRO ISTRAC Apprentice Notification 2026 Released for 96 Apprentice Posts; Stipend Up to Rs 12,300 Per Month
నిరుద్యోగ యువతకు ISROలో ఉద్యోగాలు.. అంతరిక్ష రంగంలో కెరీర్‌కు గోల్డెన్ ఛాన్స్! దరఖాస్తు ఇలా..
ISRO-ISTRAC Apprentice Recruitment 2026: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలోని ISTRAC సంస్థ 2026-27 సంవత్సరానికి 96 గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్, డిప్లొమా, ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు జులై 31, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.9,600 నుంచి రూ.12,300 వరకు స్టైపెండ్ అందించనున్నారు.,
ఇస్రో ఆధ్వర్యంలోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ (ISTRAC).. 2026-27 సంవత్సరానికిగానూ గ్రాడ్యుయేట్, డిప్లొమా, ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషణ్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 96 అప్రెంటిస్ ట్రెయినీ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో జులై 31, 2026 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ పూర్తి చేసి ఉండాలి. డిప్లొమా పోస్టులకు సంబంధిత ఇంజినీరింగ్ డిప్లొమా, ఐటీఐ పోస్టులకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత పొంది ఉండాలి. 2024, 2025, 2026 సంవత్సరాల్లో కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. అలాగే NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఈ కింది మెయిల్ ఐడీలకు జులై 31, 2026వ తేదీలోపు దరఖాస్తులు పంపించాల్సి ఉంటుంది. ఈమెయిల్ ద్వారా పంపించే దరఖాస్తుల్లో సబ్జెక్ట్‌లో సంబంధిత పోస్టు కోడ్ తప్పనిసరిగా పేర్కొనాలి. ఈమెయిల్‌లో పేరు, మొబైల్ నంబర్, విద్యార్హత వివరాలు, ఉత్తీర్ణత సంవత్సరం, ఎన్‌ఏటీఎస్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ ఇవ్వాలి. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఉంటుంది. మెరిట్ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.12,300, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.10,900, ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌కు రూ.9,600 చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు.