ISROలో ఉద్యోగాలకు పిలుపు.. ఆగస్ట్ 28 వరకే ఛాన్స్! ఎలాంటి రాత పరీక్ష లేదు

ఇస్రోకు చెందిన యు.ఆర్. రావు శాటిలైట్‌ సెంటర్‌ (URSC), బెంగళూరులో 2026-27 సంవత్సరానికి అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌, కమర్షియల్‌ ప్రాక్టిస్‌ అప్రెంటిస్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. BE/BTech, డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు..

ISROలో ఉద్యోగాలకు పిలుపు.. ఆగస్ట్ 28 వరకే ఛాన్స్! ఎలాంటి రాత పరీక్ష లేదు
ISRO Apprentice Recruitment

Updated on: Aug 23, 2026 | 4:49 PM

ఇస్రోలో అప్రెంటిస్‌ శిక్షణ పొందాలనుకునే యువతకు మంచి అవకాశం వచ్చింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)కు చెందిన UR రావు శాటిలైట్‌ సెంటర్‌ (URSC), బెంగళూరు 2026-27 సంవత్సరానికి గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌, కమర్షియల్‌ ప్రాక్టిస్‌ అప్రెంటిస్‌ శిక్షణ కోసం మొత్తం 410 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 28, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అప్రెంటిస్‌షిప్‌ ద్వారా ఈ కింది వివిధ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు..

విభాగాల వారీగా పోస్టుల వివరాలు..

  • గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ (BE/BTech) పోస్టుల సంఖ్య: 220
  • టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ (డిప్లొమా) పోస్టుల సంఖ్య: 120
  • కమర్షియల్‌ ప్రాక్టిస్‌ అప్రెంటిస్‌ పోస్టుల సంఖ్య: 70

ISROలో అప్రెంటిస్‌ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌, కెమికల్‌, ఇండస్ట్రియల్‌, ఆటోమొబైల్‌, ఏరోనాటికల్‌, ఏరోస్పేస్‌, సివిల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఎలక్ట్రికల్‌, డిప్లొమా ఇన్‌ కమర్షియల్‌ ప్రాక్టిస్‌ తదితర విభాగాల్లో అప్రెంటిస్‌ శిక్షణకు అవకాశం కల్పించారు. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి BE/BTech ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు గుర్తింపు పొందిన రాష్ట్ర బోర్డు నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. కమర్షియల్‌ ప్రాక్టిస్‌ అప్రెంటిస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి డిప్లొమా ఇన్‌ కమర్షియల్‌ ప్రాక్టిస్‌ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 2022, 2023, 2024, 2025 లేదా 2026లో తమ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. 2021 కంటే ముందు ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు.

ఇవి కూడా చదవండి

ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్ట్ 28, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా అభ్యర్థులు National Apprenticeship Training Scheme (NATS) పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. అనంతరం UMANG పోర్టల్‌లోకి వెళ్లి URSC Apprenticeshipను సెర్చ్‌ చేసి దరఖాస్తు చేయాలి. NATSలో పొందిన Enrollment/Apprenticeship Registration Numberను UMANG దరఖాస్తులో తప్పనిసరిగా నమోదు చేయాలి. BE/BTech/డిప్లొమా మార్కుల మెమోలు, సర్టిఫికెట్లు, ఫొటో, సంతకం తదితర అవసరమైన పత్రాలను సూచించిన ఫార్మాట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. అప్రెంటిస్‌ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థులు తమ విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లకు నెలకు రూ.12,300 స్టైపెండ్‌ అందుతుంది. డిప్లొమా, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లకు నెలకు రూ.10,900 స్టైపెండ్‌ చెల్లిస్తారు.

ISROలో అప్రెంటిస్‌ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us