ICAI Results 2025: మరికాసేపట్లో సీఏ ఫైనల్‌ రిజల్ట్స్‌ విడుదల.. ఫలితాల డైరెక్ట్ లింక్ ఇదే

ICAI CA Final and Intermediate September 2025 results today: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) సెప్టెంబర్‌ సెషన్‌ 2025 సీఏ ఫైనల్, ఇంటర్మీడియట్, ఫౌండేషన్ పరీక్షల ఫలితాలను సోమవారం (నవంబర్ 3) ప్రకటించనుంది. ఈ మేరకు ప్రకటన వెలువరించింది. అధికారిక నోటీసు ప్రకారం..

ICAI Results 2025: మరికాసేపట్లో సీఏ ఫైనల్‌ రిజల్ట్స్‌ విడుదల.. ఫలితాల డైరెక్ట్ లింక్ ఇదే
ICAI CA Final and Intermediate September results

Updated on: Nov 03, 2025 | 7:41 AM

హైదరాబాద్, నవంబర్‌ 3: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) సెప్టెంబర్‌ సెషన్‌ 2025 సీఏ ఫైనల్, ఇంటర్మీడియట్, ఫౌండేషన్ పరీక్షల ఫలితాలను సోమవారం (నవంబర్ 3) ప్రకటించనుంది. ఈ మేరకు ప్రకటన వెలువరించింది. అధికారిక నోటీసు ప్రకారం.. సీఏ ఫైనల్ ఇంటర్మీడియట్ ఫలితాలు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు వెలువడనున్నాయి. ఇక ఫౌండేషన్ స్థాయి పరీక్షా ఫలితాలు ఇదే రోజు సాయంత్రం 5 గంటలకు విడుదల కానున్నట్లు పేర్కొంది. విద్యార్ధులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ లేదంటే రోల్‌ నంబర్‌ అధికారిక వెబ్‌సైట్‌లో icaiexam.icai.org లేదా icai.nic.in/caresult నమోదు చేసి ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణజూనియర్‌ పంచాయతీ సెక్రటరీ స్పోర్ట్స్‌ కోటా ఫలితాలు వచ్చేశాయ్‌.. లింక్‌ ఇదే

తెలంగాణలోని జూనియర్‌ పంచాయతీ సెక్రటరీ (జేపీఎస్‌) స్పోర్ట్స్‌ క్యాటగిరి పోస్టుల ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రిజల్ట్స్‌ను అధికారిక వెబ్‌సైట్‌ లో అందుబాటులో ఉంచింది. మొత్తం 9,355 పోస్టులతో 2018లో అప్పటి ప్రభుత్వం ఈ ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే 2021లో ఈ పోస్టులకు రాత పరీక్షలు నిర్వహించింది. సంబంధిత కేటగిరిల్లో ఆయా పోస్టులను భర్తీ చేసింది. మిగిలిన 172 పోస్టులకు స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేయనుంది. ఈ జేపీఎస్‌ పోస్టుల ఫలితాలను తాజాగా విడుదల చేసింది. అభ్యర్థులు ఈ కింది డైరెక్ట్ లింక్‌లో తమ హాల్‌ టికెట్‌ నంబర్‌ లేదా రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణజూనియర్‌ పంచాయతీ సెక్రటరీ స్పోర్ట్స్‌ కోటా ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.