నిరుద్యోగులకు శుభవార్త. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్(ఈఎంఆర్‌ఎస్) నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. దీనిలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 4,062 ఖాళీలను నోటిఫికేషన్లో ప్రకటించారు. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లింక్ కూడా యాక్టివ్ లో ఉంది. వీటిల్లో కొన్ని పోస్టులను అప్లై చేయడానికి చివరి తేదీ జూలై 30 కాగా.. మరికొన్ని పోస్టులకు ఆగస్టు 18 వరకూ సమయం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే విధానాన్ని ఇప్పుడు చూద్దాం..
ప్రిన్సిపల్ పోస్టుకి అప్లికేషన్ ఫీజు రూ. 2000, అలాగే పీజీటీకి రూ. 1500, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు రుసుము రూ. 1000 ఉంటుంది. అయితే ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు పొందుతారు.
అభ్యర్థులు ముందుగా ఈఎంఆర్ఎస్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
దానిలోని హోమ్ పేజీలో కెరీర్/నోటిఫికేషన్ ట్యాబ్ పై క్లిక్ చేయాలి.
ఈఎంఆర్ఎస్ రిక్రూట్ మెంట్ 2023 అప్లికేషన్ ఫారం ను పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్లను పూరించాలి.
వివరాలు అన్ని సరిచూసుకొని, పేమెంట్ చేయాలి.
కేటగిరీ వైజ్ గా సూచించిన మొత్తాన్ని ఫీజుగా చెల్లించాలి. అనంతరం సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకొని భద్రపరచుకోవాలి.
దరఖాస్తులో పొందుపరిచే ప్రతి వివరం కూడా కచ్చితమైనదిగా ఉండాలి. ముఖ్యంగా అభ్యర్థుల పేరు, కాంటాక్ట్/అడ్రెస్ వివరాలు, కేటగిరీ, పీడబ్ల్యూడీ స్టేటస్, విద్యార్హత వివరాలు, డేట్ ఆఫ్ బర్త్, చాయిస్ ఆఫ్ ఎగ్జామ్ సిటీస్ వంటివి మీరు అప్లికేషన్ ఎంటర్ చేసినవే ఫైనల్ అవుతాయి. అందుకే మీ సర్టిఫికెట్స్ ఆధారంగా వివరాలన్నీ పొందుపరచాలి. అప్లై చేసిన తర్వాత ఈఎంఆర్ఎస్ వెబ్ సైట్, అలాగే అప్లికేషన్ ఫారంలో ఇచ్చిన ఈ-మెయిల్ ఇన్ బాక్స్ ను తరచూ తనిఖీ చేస్తూ ఉండాలి. పరీక్ష సంబంధించిన వివరాలు అందులో ఉంటాయి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..