TGPSC Recruitment 2026: హైదరాబాద్ వాటర్ సప్లై బోర్డులో 130 ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.1.33 లక్షల జీతం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు శుభవార్త. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డులో (HMWSSB) 130 మేనేజర్ (ఇంజినీరింగ్) పోస్టుల భర్తీకి TGPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో బీఈ/బీటెక్‌ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు..

TGPSC Recruitment 2026: హైదరాబాద్ వాటర్ సప్లై బోర్డులో 130 ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.1.33 లక్షల జీతం
HMWSSB Recruitment

Updated on: Sep 20, 2026 | 3:43 PM

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు శుభవార్త. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB)లో రెగ్యులర్ ప్రాతిపదికన మేనేజర్ (ఇంజినీరింగ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 130 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, వయోపరిమితి ఉన్న అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. సివిల్, ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజినీరింగ్లో అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయోపరిమితి 2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన అభ్యర్ధులు మేనేజర్ (ఇంజినీరింగ్) పోస్టులకు సెప్టెంబరు 23, 2026వ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది.

అర్హులైన అభ్యర్థులు 2026 అక్టోబరు 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, ఇతర నిబంధనలను పూర్తిగా పరిశీలించాలి. నిర్ణీత గడువు ముగిసేలోపు ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించాలి. ఎంపికైన వారికి నెలకు రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డులో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us