CRPF Recruitment: సీఆర్‌పీఎఫ్‌లో పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక. అర్హులెవరంటే..

|

Aug 16, 2021 | 5:06 PM

CRPF Recruitment 2021: సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పారామెడికల్‌ స్టాఫ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు...

CRPF Recruitment: సీఆర్‌పీఎఫ్‌లో పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక. అర్హులెవరంటే..
Crpf Recruitment
Follow us on

CRPF Recruitment 2021: సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పారామెడికల్‌ స్టాఫ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పలు విభాగాల్లో మొత్తం 2439 ఖాళీలకు గాను నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ పోస్టులకు ఎవరు అర్హులు, ఎలా నియామకం చేపడుతారు లాంటి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 2439 ఖాళీలకు గాను ఏఆర్‌ – 156, బీఎస్‌ఎఫ్‌ – 365, సీఆర్‌పీఎఫ్‌ 1537, ఐటీబీపీ – 130, ఎస్‌ఎస్‌బీ – 251 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పారామెడికల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. గతంలో సీఏపీఎఫ్‌లో కానీ ఎక్స్‌ ఆర్మీ ఉద్యోగై ఉండాలి. (మహిళలు, పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చు).
* ఎంపికైన అభ్యర్థులు సీఏపీఫ్‌ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్‌ విధానంలో పారామెడికల్‌ స్టాఫ్‌గా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
* అభ్యర్థుల వయసు 62 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది.
* ఈ ఇంటర్వ్యూలను 13-09-2021 నుంచి 15-09-2021 వరకు నిర్వహించనున్నారు.
* అభ్యర్థులను ఏడాది కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు.
* ఇంటర్వ్యూకి హాజరయ్యే సమయంలో అభ్యర్థులు అన్ని ఒరిజినల్‌ సర్టిఫికేట్లను తీసుకురావాల్సి ఉంటుంది.
* రిటైర్‌మెంట్‌ సర్టిఫికేట్‌, డిగ్రీ, వయసు నిర్ధారణ, ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికేట్లను వెంట తెచ్చుకోవాలి.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Taliban – China: చైనా తోక వంకర.. తాలిబన్ రాక్షసులతో స్నేహం చేస్తామంటూ డ్రాగన్ దేశం ప్రకటన

CM KCR: శాలపల్లిలో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన.. ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా.. దళితబంధు వర్తిస్తుంది..

Viral News: 3 లక్షలు ఉన్న బ్యాగ్ కొట్టేసిన కోతి.. పోలీస్ స్టేషన్‌కు పంచాయతీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?