Coal India Jobs 2026: నెలకు రూ.2 లక్షల వరకు జీతంతో కోల్ ఇండియాలో 276 ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే జాబ్‌ మీదే

కోల్ ఇండియా లిమిటెడ్‌లోని మైనింగ్‌ విభాగంలో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 276 పోస్టులను భర్తీ చేయనుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు లింక్ ఈ కింద ఉంది..

Coal India Jobs 2026: నెలకు రూ.2 లక్షల వరకు జీతంతో కోల్ ఇండియాలో 276 ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే జాబ్‌ మీదే
Coal India Jobs

Updated on: May 08, 2026 | 3:56 PM

భారత ప్రభుత్వ మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌కతాలోని కోల్ ఇండియా లిమిటెడ్ (CIL).. మైనింగ్‌ విభాగంలో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 276 పోస్టులను భర్తీ చేయనుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే కేవలం గేట్‌ 2025 స్కోర్‌ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ రోజు (మే 8) నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (మైనింగ్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మైనింగ్ ఇంజినీరింగ్‌లో బీఈ లేదా బీటెక్‌ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు కనీసం 60 శాతం మార్కులు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. దీనితో పాటు గేట్‌ 2025 పరీక్షలో అర్హత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు ఏప్రిల్‌ 30, 2026వ తేదీ నాటికి 30 ఏళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వరకు వయోసడలింపు ఉంటుంది.

ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 7, 2026వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుము కింద జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులు రూ.1180 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, కోల్ ఇండియా ఉద్యోగులకు ఎలాంటి ఫీజు లేదు. వచ్చిన దరఖాస్తులను గేట్‌ 2025 స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ , మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి శిక్షణ కాలంలో నెలకు రూ.60,000 చొప్పున చెల్లిస్తారు. శిక్షణ పూర్తయ్యాక రూ.1,80,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

కోల్ ఇండియాలో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us