AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

Telangana Police Recruitment update: తెలంగాణ పోలీసు శాఖలో 2028 నాటికి అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొత్తం 7,437 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చామని, పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. డ్రగ్స్ నియంత్రణ, ఆహార కల్తీ నివారణపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.

పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
CM Revanth Reddy Announces Police Recruitment Plan
Rajashekher G
|

Updated on: Oct 21, 2026 | 11:51 AM

Share

Telangana Police Recruitment: తెలంగాణలో శాంతిభద్రతల పరిరక్షణకు, పోలీసు శాఖను మరింత బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉన్నప్పుడే రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా సాగుతుందని పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని గోషామహల్‌లో నిర్వహించిన పోలీసు స్మారక పరేడ్‌కు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. సమాజ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ ఏడాది 155 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు.

పోలీసు శాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం వెల్లడించారు. 4,773 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని, మొత్తం 7,437 పోస్టుల భర్తీకి అనుమతులు మంజూరు చేశామని తెలిపారు. మిగిలిన ఖాళీలను విడతలవారీగా భర్తీ చేస్తామని, 2028 నాటికి పోలీసు శాఖలో అన్ని ఖాళీలను పూర్తి చేస్తామని ప్రకటించారు. 112 మంది డీఎస్పీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా నియమించినట్లు వివరించారు. పోలీసు అమరవీరుల ఎక్స్‌గ్రేషియాను హోదా ఆధారంగా కోటి రూపాయలకు పైగా పెంచామని చెప్పారు. పోలీసు సిబ్బంది పిల్లల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

యువత డ్రగ్స్‌కు బానిసలవడం ఆందోళనకరమని రేవంత్ రెడ్డి అన్నారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఈ విషయంలో పోలీసు శాఖ పనితీరు ప్రశంసనీయమని కొనియాడారు. ఆహార కల్తీని నియంత్రించేందుకు టీజీ సేఫ్ ద్వారా కఠిన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణలో ట్రాన్స్‌జెండర్లకు బాధ్యతలు అప్పగించడం సాహసోపేత నిర్ణయమని పేర్కొన్నారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే నేరస్థులతో స్నేహంగా ఉండటం కాదని సీఎం స్పష్టం చేశారు. బాధితులు, సామాన్యులు, అమాయకుల పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూనే.. నేరస్థులు, భూకబ్జాదారులు, డ్రగ్స్ వ్యాపారులపై కఠినంగా ఉండాలని పోలీసులకు సూచించారు. అమరవీరుల త్యాగాలను గౌరవిస్తూ సురక్షితమైన, అభివృద్ధి చెందిన తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.

Follow Us
పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ ప్రకటన
పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ ప్రకటన
ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు!
ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు!
ఫస్ట్ నైట్‌కు ముందే వరుడి దారుణ హత్య.. ఓటీటీలో సూపర్ హిట్ సినిమా
ఫస్ట్ నైట్‌కు ముందే వరుడి దారుణ హత్య.. ఓటీటీలో సూపర్ హిట్ సినిమా
హార్దిక్ పాండ్యాకు మరో షాక్.. ఐపీఎల్‌ 2027 వరకు క్రికెట్‌కు దూరం?
హార్దిక్ పాండ్యాకు మరో షాక్.. ఐపీఎల్‌ 2027 వరకు క్రికెట్‌కు దూరం?
టాలెంట్ ఉన్నా వెలుగులోకి రాలేకపోయిన ఏడుగురు క్రికెటర్లు వీళ్లే
టాలెంట్ ఉన్నా వెలుగులోకి రాలేకపోయిన ఏడుగురు క్రికెటర్లు వీళ్లే
జియో మెగా ఐపీవో సునామీ.. ప్రారంభంలోనే రికార్డు స్థాయిలో స్పందన
జియో మెగా ఐపీవో సునామీ.. ప్రారంభంలోనే రికార్డు స్థాయిలో స్పందన
అందుకే ఆ ఫ్లాప్ తర్వాత ఆ డైరెక్టర్‌తో సినిమా చేయలేదు..
అందుకే ఆ ఫ్లాప్ తర్వాత ఆ డైరెక్టర్‌తో సినిమా చేయలేదు..
ఐదు సూపర్‌ఫాస్ట్ రైళ్లలో కొత్త సేవలు.. ఏఐ టెక్నాలజీతో క్లీనింగ్..
ఐదు సూపర్‌ఫాస్ట్ రైళ్లలో కొత్త సేవలు.. ఏఐ టెక్నాలజీతో క్లీనింగ్..
నూనె పీల్చకుండా పెసర గారెలు ఇలా చేస్తే ఇంటిల్లి పాది లాగిస్తారు
నూనె పీల్చకుండా పెసర గారెలు ఇలా చేస్తే ఇంటిల్లి పాది లాగిస్తారు
బిగ్‌బాస్‌లో ఆ కంటెస్టెంట్ చాలా సైలెంట్.. కప్పు కూడా అతనికే
బిగ్‌బాస్‌లో ఆ కంటెస్టెంట్ చాలా సైలెంట్.. కప్పు కూడా అతనికే