CITD Recruitment 2023: హైదరాబాద్‌ సీఐటీడీలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే.

|

Apr 15, 2023 | 6:36 PM

ఎంఎస్‌ఎంఈ-టూల్ రూమ్, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ఉన్న ఈ సంస్థలో ఖాళీలను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.?

CITD Recruitment 2023: హైదరాబాద్‌ సీఐటీడీలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే.
Citd Recruitment 2023
Follow us on

ఎంఎస్‌ఎంఈ-టూల్ రూమ్, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ఉన్న ఈ సంస్థలో ఖాళీలను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా ఫ్యాకల్టీ, ట్రైనర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ఆటోమేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్, సీఎన్‌సీ మ్యాచింగ్ అండ్‌ ప్రోగ్రామింగ్, కెమిస్ట్రీ, కన్వెన్షనల్‌ అండ్‌ సీఎన్‌సీ మెషీన్స్‌, టూల్ డిజైన్, సివిల్ ఇంజినీరింగ్, క్యాడ్‌/ క్యామ్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈమెయిల్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులు తమ దరఖాస్తులను training@citdindia.org, hr@citdindia.org మెయిల్‌ ఐడీకి పంపించాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ట్రేడ్ టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్‌ 23వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..