CBSE 10th Result Date 2026: మరో వారంలో సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదల..! మేలో రెండో విడత పరీక్షలు షురూ

సీబీఎస్సీ పదో తరగతి ఫలితాల కోసం దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 14 నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. మే నెలలో..

CBSE 10th Result Date 2026: మరో వారంలో సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదల..! మేలో రెండో విడత పరీక్షలు షురూ
CBSE Class 10th result date and Time

Updated on: Apr 07, 2026 | 2:55 PM

హైదరాబాద్‌, ఏప్రిల్ 7: సీబీఎస్‌ఈ (CBSE) పదో తరగతి ఫలితాల కోసం దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 14 నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. మే నెలలో రెండో విడత బోర్డు పరీక్షలు జరగనున్నందున బోర్డు ఈ నెలాఖరులోపు ఫలితాల విడుదల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. కాగా ఫలితాల విడుదల తేదీపై బోర్డు నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

సీబీఎస్సీ బోర్డు ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు results.cbse.nic.in లేదా cbse.nic.in అధికారిక వెబ్‌సైట్‌లతో పాటు డిజిలాకర్ (DigiLocker), ఉమాంగ్ (UMANG) యాప్‌ల ద్వారా కూడా తమ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. విద్యార్ధులు తమ రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీ, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గత ఏడాది సీబీఎస్ఈ రెండు-పరీక్షల విధానం ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ విధానం ప్రకారం గరిష్టంగా మూడు సబ్జెక్టులలో మార్కులను మెరుగుపరుచుకోవాలనుకునే విద్యార్థులతోపాటు కంపార్ట్‌మెంట్ కేటగిరీలో ఉన్నవారు రెండవ విడత పరీక్షలు రాసేందుకు అర్హత సాధిస్తారు.

ఆ ఏడాది 10వ తరగతి బోర్డు పరీక్షలు మార్చి 11న ముగియగా, 12వ తరగతి పరీక్షలు ఇంకా జరుగుతున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 10వ తేదీతో ముగియనున్నాయి. ఈ రెండు తరగతుల పరీక్షలు ఫిబ్రవరి 17న దేశ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us