CTET 2024: సీటెట్‌ (జనవరి) 2024 దరఖాస్తులకు తుది గడువు పెంపు.. ఎప్పటివరకంటే

సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్ జవవరి 2024) తుది గడువును పొడిగిస్తూ సీబీఎస్సీ ప్రకటన వెలువరించింది. నవంబర్‌ 30వ తేదీతో తుదిగడువు ముగియ నుండగా దానిని డిసెంబర్ 1వ తేదీ వరకు పొడిగించారు. ఈ పరీక్షను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్​ఈ) నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. సీటెట్​ పరీక్ష ప్రతి ఏడాది రెండుసార్లు జరుగుతుంది. తాజాగా సీటెట్‌ జనవరి-2024 పరీక్ష వచ్చే..

CTET 2024: సీటెట్‌ (జనవరి) 2024 దరఖాస్తులకు తుది గడువు పెంపు.. ఎప్పటివరకంటే
CTET 2024

Updated on: Nov 30, 2023 | 1:29 PM

న్యూఢిల్లీ, నవంబర్‌ 30: సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్ జవవరి 2024) తుది గడువును పొడిగిస్తూ సీబీఎస్సీ ప్రకటన వెలువరించింది. నవంబర్‌ 30వ తేదీతో తుదిగడువు ముగియ నుండగా దానిని డిసెంబర్ 1వ తేదీ వరకు పొడిగించారు. ఈ పరీక్షను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్​ఈ) నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. సీటెట్​ పరీక్ష ప్రతి ఏడాది రెండుసార్లు జరుగుతుంది. తాజాగా సీటెట్‌ జనవరి-2024 పరీక్ష వచ్చే ఏడాది జనవరి 21వ తేదీన రెండు పేపర్లకు పరీక్ష జరగనుంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. రెండు పేపర్లు ఆన్‌లైన్ విధానంలో జరుగుతాయి.

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ జేఈ రాత పరీక్ష తుది కీ విడుదల

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు, శాఖల్లో 1,324 జూనియర్‌ ఇంజినీర్‌ గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) నియామకాలకు సంబంధించి రాత పరీక్ష (పేపర్‌-1) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు అక్టోబర్‌ 9 నుంచి 11వ తేదీ వరకు జరిగాయి. ఈ పరీక్షకు సంబంధించిన తుది ఆన్సర్‌ కీలను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ తాజాగా విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో రోల్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ నమోదు చేసి ప్రశ్నపత్రం, కీలను డిసెంబర్‌ 13వ తేదీలోగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఓ ప్రకటనలో తెల్పింది. పేపర్‌-1 (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌), పేపర్‌-2 (ఆఫ్‌లైన్‌ డిస్క్రిప్టివ్‌) రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఈ పోస్టులను అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.

డిసెంబర్ 1 నుంచి ఇగ్నో పరీక్షలు

ఇగ్నో నిర్వహించే డిసెంబర్‌ 2023 టర్మ్‌ ఎండ్‌ పరీక్షలు డిసెంబర్‌ 1 నుంచి జనవరి 9వ తేదీ వరకు జరుగుతాయని ఇగ్నో విజయవాడ ప్రాంతీయ కేంద్రం రీజినల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె సుమలత నవంబరు 29 ఒక ప్రకటనలో వెల్లడించారు. విజయవాడ పరిధిలో ఏడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, ఆదోని, అనంతపురంలో పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆమె తెలిపారు. అర్హులైన అభ్యర్థులందరూ ఇగ్నో అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us