CBSE 12th Results 2026: సీబీఎస్సీ 12వ తరగతి ఫలితాలపై వీడిన ఉత్కంఠ.. ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తమ బోర్డు పరీక్షల స్కోర్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 10వ తరగతి ఫలితాలు వెల్లడించిన సీబీఎస్ఈ.. 12వ తరగతి ఫలితాలు 2026 ప్రకటన కోసం కసరత్తు చేస్తుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేసిన వెంటనే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది..

CBSE 12th Results 2026: సీబీఎస్సీ 12వ తరగతి ఫలితాలపై వీడిన ఉత్కంఠ.. ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే
CBSE class 12th Result Date And Time

Updated on: May 10, 2026 | 3:04 PM

హైదరాబాద్‌, మే 10: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సీబీఎస్సీ 12వ తరగతి ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. బోర్డు అధికారుల సమాచారం మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి బోర్డు పరీక్షా ఫలితాలను మే మూడో వారంలో ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే (ఏప్రిల్ 15) సీబీఎస్సీ 10వ తరగతి ఫలితాలను బోర్డు వెల్లడించిన
సంగతి తెలిసిందే. ప్రస్తుతం 12వ తరగతి ఫలితాల విడుదలపై దృష్టి సారించింది.

కాగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా 7,574 కేంద్రాలలో జరిగిన సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షలకు మొత్తం 18,59,551 మంది విద్యార్థులు హాజరయ్యారు. 120 సబ్జెక్టులకు సంబంధించిన ఈ పరీక్షలను ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 10 మధ్య నిర్వహించారు. మొత్తం అభ్యర్థులలో 10,27,552 మంది అబ్బాయిలు, 8,31,999 మంది అమ్మాయిలు ఈ పరీక్షలకు హాజరయ్యారు. మూల్యాంకన ప్రక్రియ దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. దీంతో ఎప్పుడెప్పుడాని ఫలితాల అధికారిక ప్రకటన కోసం విద్యార్ధులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

2024, 2025 సంవత్సరాల్లో మే 13న, 2023లో మే 12న ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి ఫలితాలు కాస్త ఆలస్యంగా వెలువడనున్నాయి. ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లు cbseresults.nic.in, cbse.gov.in, results.cbse.nic.in లేదా results.digilocker.gov.inలలో విద్యార్ధులు తమ రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోవచ్చు. అలాగే ఉమాంగ్ (UMANG) యాప్ ద్వారా కూడా ఫలితాలను పొందే అవకాశం ఉంది. మరోవైపు స్కోర్‌కార్డులు త్వరలో విడుదల కావచ్చని డిజిలాకర్ వెల్లడించండంలో సీబీఎస్సీ ఏ క్షణమైనా 12వ తరగతి ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అయితే సీబీఎస్ఈ ఇంకా ఖచ్చితమైన తేదీ, సమయాన్ని ధృవీకరించలేదు. 12వ తరగతి ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లతోపాటు డిజిలాకర్, ఉమాంగ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా అందుబాటులో ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us