విద్యార్థులకు ఎగిరిగంతేసే న్యూస్.. ఆగస్టు 8 నుంచి 10 వరకు అన్ని స్కూళ్లకు వరుస సెలవులు?

ఆగస్ట్ నెల మొత్తం పండగలతో నిండి ఉంటుంది. అందుకే ప్రతిసారి ఈ నెలలో వరుస సెలవులు వస్తుంటాయి. ఈ క్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు వరుసగా మూడు రోజుల సెలవులు రానున్నాయి. ఆగస్టు 8 నుంచి పాఠశాలలు, విద్యాసంస్థలు వరుసగా మూడు రోజులు మూతపడనున్నాయి..

విద్యార్థులకు ఎగిరిగంతేసే న్యూస్.. ఆగస్టు 8 నుంచి 10 వరకు అన్ని స్కూళ్లకు వరుస సెలవులు?
Bonalu Holidays

Edited By:

Updated on: Aug 07, 2026 | 1:28 PM

హైదరాబాద్, ఆగస్ట్ 3: రాష్ట్ర విద్యార్థులకు ఆగస్టులో వరుసగా మూడు రోజుల సెలవులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలోని ప్రముఖ సాంప్రదాయ పండుగ బోనాలు వారాంతపు సెలవులతో కలిసి రానున్నాయి. దీంతో ఆగస్టు 8 నుంచి 10 వరకు విద్యాసంస్థలకు వరుస సెలవులు ఉండే అవకాశంపై చర్చ జరుగుతోంది. అయితే ఆగస్టు 10న సెలవు ప్రకటించాలా లేదా అన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆగస్టు 8 (శనివారం) రెండో శనివారం కావడంతో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, పలు ప్రభుత్వ కార్యాలయాలకు సాధారణ సెలవు రానుంది. ఆగస్టు 9 (ఆదివారం) వారాంతపు సెలవుతో పాటు తెలంగాణలో అత్యంత వైభవంగా నిర్వహించే బోనాల పండుగ. ఇక ఆగస్టు 10 (సోమవారం) బోనాల అనంతరం జరిగే రంగం కార్యక్రమం సందర్భంగా స్థానిక సెలవు ప్రకటించే అవకాశం ఉంది.

ఆగస్టు 8, 9 తేదీలకు ఇప్పటికే సాధారణ సెలవులు ఉన్నప్పటికీ, ఆగస్టు 10న రంగం సందర్భంగా స్థానిక సెలవు ప్రకటించాలా లేదా అనే అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదు. ప్రతి ఏడాది రంగం సందర్భంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో స్థానిక సెలవు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా అదే విధంగా సెలవు ప్రకటించే అవకాశముందని భావిస్తున్నారు. బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ప్రధాన పండుగల్లో ఒకటి. హైదరాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం సహా పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు, ఊరేగింపులు, సాంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బోనాల అనంతరం నిర్వహించే రంగం కార్యక్రమం కూడా విశేష ప్రాధాన్యం కలిగి ఉంటుంది.

ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించి ఆగస్టు 10న కూడా సెలవు ప్రకటిస్తే.. విద్యార్థులు, ఉపాధ్యాయులకు వరుసగా మూడు రోజుల విశ్రాంతి లభించనుంది. దీంతో చాలామంది కుటుంబ సభ్యులతో కలిసి బోనాల వేడుకల్లో పాల్గొనడం, బంధువుల ఇళ్లకు వెళ్లడం, చిన్నపాటి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఆగస్టు 10 సెలవుపై తుది నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసే అధికారిక ప్రకటన తర్వాతే స్పష్టత రానుంది. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే సంబంధిత జిల్లాల్లోని పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవు అమల్లోకి రానుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us