డిగ్రీ, డిప్లొమా మార్కులతో నేరుగా BEMLలో 1346 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు

ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌ (BEML) అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్‌, డిప్లొమా, ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌, మెషినిస్ట్‌ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి..

డిగ్రీ, డిప్లొమా మార్కులతో నేరుగా BEMLలో 1346 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు
BEML Apprentice Recruitment

Updated on: Aug 25, 2026 | 9:29 PM

ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌ (BEML) 1346 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న BEML.. డిఫెన్స్‌, ఏరోస్పేస్‌, మైనింగ్‌, కన్‌స్ట్రక్షన్‌, రైల్‌, మెట్రో వంటి కీలక రంగాలకు అవసరమైన భారీ పరికరాలను తయారు చేస్తోంది. 1964లో బెంగళూరులో స్థాపించిన ఈ సంస్థలో అప్రెంటిస్‌ అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 8, 2026వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

BEMLలో అప్రెంటీస్‌ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నియామకంలో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ (ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్‌), డిప్లొమా అప్రెంటిస్‌, ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు ఉన్నాయి. మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, కంప్యూటర్‌/ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌, మెషినిస్ట్‌, మోటార్‌ వెహికల్‌ మెకానిక్‌ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో డిప్లొమా, ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత అవసరం. దరఖాస్తుదారులకు కనీసం 17 సంవత్సరాల వయసు ఉండాలి.

ఇవి కూడా చదవండి

BEML అప్రెంటిస్‌ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 8, 2026లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల ఎంపిక మెరిట్‌ ఆధారంగా జరుగుతుంది. ప్రతి ట్రేడ్‌, ప్రతి లొకేషన్‌లో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్యకు అనుగుణంగా 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. ఎంపికైన గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లకు నెలకు రూ.12,300, డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ.10,900 స్టైపెండ్‌ అందుతుంది. ట్రేడ్‌ అప్రెంటిస్‌లకు ట్రేడ్‌ను బట్టి రూ.9,000 నుంచి రూ.10,560 వరకు స్టైపెండ్‌ చెల్లిస్తారు. దరఖాస్తు ప్రక్రియ, పోస్టుల వారీగా అర్హతలు, ఖాళీలు, ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలను BEML అధికారిక రిక్రూట్‌మెంట్‌ వెబ్‌సైట్‌లో పరిశీలించాలి.

BEMLలో అప్రెంటీస్‌ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us