BEL Recruitment 2023: బీఈ/బీటెక్‌ అర్హతతో భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

ఘజియాబాద్‌లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌.. 38 ట్రైనీ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌ స్పెషలైజేషన్‌లో నాలుగేళ్ల బీఈ/బీటెక్‌ లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో కనీసం ఏడాదిపాటు అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు జనవరి 1, 2023వ తేదీనాటికి 28, 32 ఏళ్లకు […]

BEL Recruitment 2023: బీఈ/బీటెక్‌ అర్హతతో భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
BEL Ghaziabad

Updated on: Mar 20, 2023 | 8:42 PM

ఘజియాబాద్‌లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌.. 38 ట్రైనీ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌ స్పెషలైజేషన్‌లో నాలుగేళ్ల బీఈ/బీటెక్‌ లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో కనీసం ఏడాదిపాటు అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు జనవరి 1, 2023వ తేదీనాటికి 28, 32 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో మార్చి 23, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో ట్రైనీ ఇంజనీర్‌ పోస్టులకు రూ.177లు, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకు రూ.472లు అప్లికేషన్‌ ఫీజు కింద చెల్లించాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు ట్రైనీ ఇంజనీర్‌ పోస్టులకు రూ.30,000, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకు రూ.40,000ల వరకు జీతంలోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us