APRS CAT 2026: గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు ఏపీఆర్‌ఎస్‌ క్యాట్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు లింక్‌ ఇదిగో!

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఐదో తరగతిలో ప్రవేశాలకు ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఏపీఆర్‌ఎస్‌ క్యాట్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బాలురు, బాలికలకు..

APRS CAT 2026: గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు ఏపీఆర్‌ఎస్‌ క్యాట్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు లింక్‌ ఇదిగో!
APRS CAT Admissions

Updated on: Mar 02, 2026 | 4:50 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఐదో తరగతిలో ప్రవేశాలకు ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఏపీఆర్‌ఎస్‌ క్యాట్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బాలురు, బాలికలకు గురుకుల పాఠశాలల్లో సీట్లు కేటాయిస్తారు. ఐదో తరగతితోపాటు 6వ, 7వ, 8వ తరగతుల్లో మిగిలిపోయిన సీట్లను కూడా భర్తీ చేస్తారు. అర్హులైన ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అనాథ, వికలాంగ విద్యార్ధులు మార్చి 31, 2026వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2026 (ఏపీఆర్‌ఎస్‌ క్యాట్‌-2026)లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఆయా గురుకులాల్లో బాలురకు, బాలికలకు వేర్వేరుగా సీట్లు కేటాయిస్తారు. 5వ తరగతిలో అన్ని గురుకులాల్లో మొత్తం 4,080 సీట్లు ఉన్నాయి. 6, 7, 8వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లు 1844 వరకు ఉన్నాయి. ఏపీఆర్‌ఎస్‌ క్యాట్‌-2026కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు ప్రవేశం కోరుతున్న తరగతికి ముందు తరగతులు అంటే ఐదో తరగతి ప్రవేశాలకు 4వ తరగతిలో, 6వ తరగతి ప్రవేశాలకు 5వ తరగతిలో, 7వ తరగతి ప్రవేశాలకు 6 తరగతిలో, 8వ తరగతిలో ప్రవేశాలకు 7వ తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. విద్యార్ధుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకూడదు.

విద్యార్ధుల వయసు ఐదో తరగతికి సెప్టెంబర్‌ 1, 015 నుంచి ఆగస్ట్ 31, 2017 మధ్య, ఆరో తరగతికి సెప్టెంబర్‌ 1, 2014 నుంచి ఆగస్ట్ 31, 2016 మధ్య, ఏడో తరగతికి సెప్టెంబర్‌ 1, 2013 నుంచి ఆగస్ట్ 31, 2015 మధ్య, ఎనిమిదో తరగతికి సెప్టెంబర్ 1, 2012 నుంచి ఆగస్ట్ 31, 2014 మధ్య జన్మించి ఉండాలి. ఈ ఆర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.100 చొప్పున చెల్లించాలి. ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 24, 2026వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

ఏపీఆర్‌ఎస్‌ క్యాట్‌-2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us