
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) మరో భారీ శుభవార్త అందించింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని డైట్ సీనియర్ లెక్చరర్, ఎస్‌సీఈఆర్‌టీ లెక్చరర్, డైట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 160 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు 2026 నవంబరు 18 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
సంబంధిత సబ్జెక్టులో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు విద్యారంగానికి సంబంధించిన వృత్తిపరమైన అర్హతలు కలిగి ఉండాలి. పోస్టుల వారీగా అవసరమైన విద్యార్హతలు, ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడిస్తారు. అభ్యర్ధుల వయోపరిమితి 2026 జులై 1 నాటికి కనీసం 18 ఏళ్లు, గరిష్ఠంగా 44 ఏళ్లకు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలను పరిశీలించాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 8, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా జరుగుతుంది. పరీక్ష విధానం, సిలబస్, మార్కుల వివరాలు, ఇతర ఎంపిక నిబంధనలను అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడిస్తారు. ఎంపికైన వారికి సీనియర్ లెక్చరర్ (డైట్) పోస్టులకు నెలకు రూ.61,960 నుంచి రూ.1,51,370 వరకు, లెక్చరర్ (ఎస్‌సీఈఆర్‌టీ) పోస్టులకు నెలకు రూ.57,700 నుంచి రూ.1,82,400 వరకు, లెక్చరర్ (డైట్) పోస్టులకు నెలకు రూ.54,060 నుంచి రూ.1,40,540 వరకు జీతంగా చెల్లిస్తారు.
ఏపీపీఎస్సీ డైట్, ఎస్‌సీఈఆర్‌టీ లెక్చరర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.