Telugu News Education Career Jobs APPSC Recruitment 2023: APPSC will issue Group 1 and Group 2 Recruitment notifications by end of November
APPSC Group 1 and Group 2: నవంబర్ నెలాఖరులోగా ఏపీపీఎస్సీ గ్రూపు-1, గ్రూపు-2 నోటిఫికేషన్లు.. మొత్తం 1603 పోస్టులకు వరుసగా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని 1,603 ఉద్యోగాల భర్తీకి ఈ నెలాఖరులోగా వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపీపీఎస్సీ) వెల్లడించిన సంగతి తెలిసిందే. వీటిల్లో గ్రూపు-1 కింద 88 పోస్టులు, గ్రూపు-2 కింద 989 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కమిషన్ బుధవారం (నవంబర్ 1) విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. గ్రూపు-1 పోస్టుల సంఖ్య మరిన్ని పెరిగే అవకాశం ఉన్నట్లు కమిషన్ పేర్కొంది. అంతేకాకుండా ఈ సారి జరగనున్న గ్రూపు-1 పరీక్షలు, మూల్యాంకనానికి కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నామని స్పష్టం..
అమరావతి, నవంబర్ 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని 1,603 ఉద్యోగాల భర్తీకి ఈ నెలాఖరులోగా వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపీపీఎస్సీ) వెల్లడించిన సంగతి తెలిసిందే. వీటిల్లో గ్రూపు-1 కింద 88 పోస్టులు, గ్రూపు-2 కింద 989 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కమిషన్ బుధవారం (నవంబర్ 1) విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. గ్రూపు-1 పోస్టుల సంఖ్య మరిన్ని పెరిగే అవకాశం ఉన్నట్లు కమిషన్ పేర్కొంది. అంతేకాకుండా ఈ సారి జరగనున్న గ్రూపు-1 పరీక్షలు, మూల్యాంకనానికి కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నామని స్పష్టం చేసింది. నిపుణుల సలహాలతో సిలబస్, పరీక్ష విధానాల్లో సమూల మార్పులు తెస్తామని తెల్పింది. గ్రూపు-1, గ్రూపు-2 తోపాటు ఏయే నోటిఫికేషన్లు, ఎన్ని పోస్టులకు విడుదలవుతాయో ఆ వివరాలు మీకోసం..