APPSC Group 1 Result Date 2025: మరో వారంలో ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 తుది ఫలితాలు విడుదల.. ఆ తర్వాతే గ్రూప్‌ 2 ఫలితాలు!

రాష్ట్రంలో గ్రూప్‌ 1 ఉద్యోగ నియామకాల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. జూన్‌ 23 నుంచి 30వ తేదీ వరకు 1:2 నిష్పత్తిలో సుమారు 182 మంది ఇంటర్వ్యూలు నిర్వహించారు. తుది ఎంపిక జాబితాను త్వరలో ఏపీపీఎస్సీ ప్రకటించనుంది. అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వారిలో మెరిట్‌ ప్రాతిపదికన ఉన్న..

APPSC Group 1 Result Date 2025: మరో వారంలో ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 తుది ఫలితాలు విడుదల.. ఆ తర్వాతే గ్రూప్‌ 2 ఫలితాలు!
APPSC Group 1 Final Result Date

Updated on: Jul 29, 2025 | 2:03 PM

అమరావతి, జులై 29: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గ్రూప్‌ 1 ఉద్యోగ నియామకాల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. జూన్‌ 23 నుంచి 30వ తేదీ వరకు 1:2 నిష్పత్తిలో సుమారు 182 మంది ఇంటర్వ్యూలు నిర్వహించారు. తుది ఎంపిక జాబితాను త్వరలో ఏపీపీఎస్సీ ప్రకటించనుంది. అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వారిలో మెరిట్‌ ప్రాతిపదికన ఉన్న స్పోర్ట్స్‌ అభ్యర్థుల జాబితాను రాష్ట్ర ఉన్నతాధికారుల కమిటీ ఎంపిక చేయాల్సి ఉంది. ఈ కమిటీ పంపించే నివేదిక ఆధారంగా గ్రూప్‌ 1 ఉద్యోగాలకు ఎంపికైన వారి వివరాలను ఏపీపీఎస్సీ వెల్లడిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియకు కనీసం వారం వరకు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఇక గ్రూప్‌ 1 తుది జాబితా వెల్లడించిన ఒకటి, రెండు వారాలకు గ్రూప్‌ 2 ఉద్యోగాలకు సైతం ఎంపికైన వారి జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేయనుంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ షెడ్యూల్‌ రూపొందించింది. గ్రూప్‌ 1 ఉద్యోగాల ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన వారిలో సుమారు 30 మంది అభ్యర్ధులు గ్రూప్‌ 2 ఉద్యోగాల సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌కూ హాజరయ్యారు. ఈ క్రమంలో గ్రూప్‌ 1లో ఖాళీలు పూరించిన తర్వాతనే గ్రూప్‌ 2కి సంబంధించిన తుది జాబితా వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ విధంగా చేయడం ద్వారా అభ్యర్ధులు ఎవరికీ నష్టం జరగకుండా ఉంటుందని, పోస్టులు మిగిలిపోయే పరిస్థితికి కూడా తలెత్తదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కమిషన్‌ తాజా నిర్ణయం తీసుకుంది.

కాగా మొత్తం 81 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి 2023లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్యూ అనంతరం అభ్యర్ధుల మార్కులతో కూడిన మెరిట్ లిస్ట్‌ను కమిషన్‌ విడుదల చేసిన అనంతరం కమిషన్‌ నియామక పత్రాలు అందజేయనుంది. ఆ వెనువెంటనే గ్రూప్‌ 2 నియామకాలు కూడా పూర్తి చేయనుంది. మొత్తం 905 గ్రూప్ 2 ఉద్యోగాలకు ఇటీవల ధ్రువపత్రాల పరిశీలన పూర్తైంది. స్పోర్ట్స్‌ కోటాతో సహా మొత్తం 2,517 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us