AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC Group 1 అభ్యర్థులకు మరో ఛాన్స్.. దరఖాస్తు గడువు పొడిగింపు

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1తో పాటు పలు ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తు గడువును నవంబర్ 9 వరకు పొడిగించింది. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. సహాయ పర్యావరణ ఇంజినీర్, ఉద్యాన అధికారి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్‌-2 సహా పలు పోస్టులకు ఇది వర్తిస్తుంది. అయితే గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది..

APPSC Group 1 అభ్యర్థులకు మరో ఛాన్స్.. దరఖాస్తు గడువు పొడిగింపు
APPSC Group 1 Last Date Extended
Srilakshmi C
|

Updated on: Oct 28, 2026 | 3:16 PM

Share

అమరావతి, అక్టోబర్ 28: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) కీలక అప్డేట్ ఇచ్చింది. గ్రూప్‌-1తో పాటు పలు ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. ఏపీపీఎస్సీ తాజా ప్రకటన ప్రకారం, గ్రూప్‌-1 సహా పలు పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే గడువును నవంబర్ 9 వరకు పొడిగించారు. అర్హత కలిగిన అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిది.

గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌లో మార్పు లేదు

గ్రూప్‌-1 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ మరో ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేసింది. దరఖాస్తు గడువును పొడిగించినప్పటికీ, గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. కాబట్టి అభ్యర్థులు ఇప్పటికే ప్రకటించిన పరీక్ష షెడ్యూల్‌కు అనుగుణంగా తమ సన్నద్ధతను కొనసాగించాలి.

ఏయే పోస్టులకు గడువు పొడిగించారు?

గ్రూప్‌-1తో పాటు కింది పోస్టులకు కూడా దరఖాస్తు గడువును పొడిగించినట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది.

  • సహాయ పర్యావరణ ఇంజినీర్ (Assistant Environmental Engineer)
  • ఉద్యాన అధికారి (Horticulture Officer)
  • వసతిగృహ సంక్షేమ అధికారి గ్రేడ్‌-2 (Hostel Welfare Officer Grade-II)
  • సహాయ గిరిజన సంక్షేమ అధికారి (Assistant Tribal Welfare Officer)
  • సహాయ సాంఘిక సంక్షేమ అధికారి (Assistant Social Welfare Officer)
  • బీసీ సంక్షేమం, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమ విభాగాల్లోని సంబంధిత పోస్టులకు ఈ గడువు పొడిగింపు వర్తిస్తుంది.

ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు వివరాలను పరిశీలించాలి. విద్యార్హతలు, వయోపరిమితి, ఇతర అర్హత ప్రమాణాలను సంబంధిత నోటిఫికేషన్‌లో చూసుకోవాలి. ఇప్పటికే దరఖాస్తు చేసినవారు పరీక్షకు సంబంధించిన తాజా సూచనలను గమనించాలి. దరఖాస్తు గడువు మాత్రమే పొడిగించారు. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష షెడ్యూల్‌లో మార్పు లేదని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌లోని పూర్తి వివరాలను తప్పనిసరిగా తనిఖీ చేయండి.

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us