AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC DL 2026 Results: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మూడేళ్ల తర్వాత APPSC డిగ్రీ లెక్చరర్‌ ఫలితాలకు ముహూర్తం ఫిక్స్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో డిగ్రీ లెక్చరర్‌ (APPSC DL Recruitment) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు వచ్చే మూడు రోజుల్లో విడుదల కానున్నాయి. ఈ మేరకు ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. రిజర్వేషన్‌ రోస్టర్‌పై ఉన్నత విద్యాశాఖ ఇటీవల నివేదిక పంపింది. దీంతో ఏపీపీఎస్సీ ఫలితాలు వెల్లడించేందుకు వేగంగా అడుగులు వేస్తుంది..

APPSC DL 2026 Results: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మూడేళ్ల తర్వాత APPSC డిగ్రీ లెక్చరర్‌ ఫలితాలకు ముహూర్తం ఫిక్స్
APPSC Degree Lecturer Result Date
Srilakshmi C
|

Updated on: May 06, 2026 | 2:48 PM

Share

అమరావతి, మే 6: రాష్ట్రంలో 290 డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి 2023 డిసెంబరులో ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2025 జులైలో అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించింది. రిజర్వేషన్‌ రోస్టర్‌పై గందరగోళ నెలకొనడంతో స్పష్టత కోరుతూ గతేడాది నవంబరులో ఉన్నత విద్య కమిషనరేట్‌కు ఏపీపీఎస్సీ ఉత్తర్వులు పంపింది. దీనిపై ఉన్నత విద్య కమిషన్‌ నివేదికను ఇటీవల ఏపీపీఎస్సీకి పంపింది. దీంతో ఫలితాలు ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.57,700 నుంచి రూ.1,82,400 వరకు వేతనంగా చెల్లిస్తారు.

సబ్జెక్టుల వారీగా పోస్టుల ఖాళీలు..

  • బయోటెక్నాలజీ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 4
  • బోటనీ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 20
  • కెమిస్ట్రీ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 23
  • కామర్స్‌ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 40
  • కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 49
  • కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 48
  • ఎకనామిక్స్‌ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 15
  • ఇంగ్లిష్‌ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 5
  • హిస్టరీ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 15
  • మేథమేటిక్స్‌ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 25
  • మైక్రోబయోలజీ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 4
  • పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 15
  • తెలుగు సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 7
  • జువాలజీ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 20

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us