AP EAPCET 2026 Application: ఏపీ ఈఏపీసెట్ 2026కు ఇంకా దరఖాస్తు చేయలేదా? మరికొన్ని గంటలే ఛాన్స్..
ఇంజనీరింగ్ బీటెక్, బీఈ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ 2026కు ఆన్‌లైన్ దరఖాస్తు గడువు సమీపిస్తుంది. ఏపీ ఈఏపీసెట్ 2026 దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మార్చి 24వ తేదీ ముగింపు సమయంలోగా..

అమరావతి, మార్చి 23: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్ బీటెక్, బీఈ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ 2026కు ఆన్‌లైన్ దరఖాస్తు గడువు సమీపిస్తుంది. ఏపీ ఈఏపీసెట్ 2026 దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మార్చి 24వ తేదీ ముగింపు సమయంలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం జనరల్ అభ్యర్ధులు రూ.800, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.700, బీసీ అభ్యర్థులు రూ.750 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి ఎలాంటి అదనపు ఫీజు భారం లేకుండా రేపటిలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ గడువు ముగిసిన తర్వాత రూ.10 వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈఏపీసెట్ ఆన్‌లైన్ పరీక్షలు మే 12 నుంచి 20వ తేదీ వరకు కాకినాడలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ నిర్వహించనుంది. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, అనుబంధ ప్రైవేట్ అన్‌ఎయిడె, అఫిలియేటెడ్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఏపీ ఈఏపీసెట్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ముఖ్యమైన తేదీలు..
- రూ 1000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 28 వరకు
- రూ.2000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 1 వరకు
- రూ.4000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 6 వరకు
- రూ.10 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 10 వరకు
- దరఖాస్తు సవరణ తేదీలు: ఏప్రిల్ 11 నుంచి 13 వరకు
- హాల్ టికెట్ల డౌన్‌లోడ్: ఏప్రిల్ 28 నుంచి
- ఏపీ ఈఏపీసెట్ 2026 ఇంజినీరింగ్ పరీక్ష తేదీలు: మే 12, 15, 18 తేదీల్లో
- ఏపీ ఈఏపీసెట్ 2026 అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్ష తేదీలు: మే 19, 20 తేదీల్లో.
- ప్రిలిమినరీ పరీక్ష కీ విడుదల తేదీ: మే 23, 2026.
- ఫలితాల విడుదల తేదీ: జూన్ 1, 2026.
ఏపీ ఈఏపీసెట్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




