AP Mega DSC 2025 Results: మెగా డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా ఫలితాలు విడుదల.. వెబ్‌సైట్‌లో ఇలా చెక్‌ చేసుకోండి..

రాష్ట్రంలో మెగా డీఎస్సీ పరీక్షలు ముగిసి నెల రోజులు గడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫలితాల కోసం ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు విద్యాశాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. స్పోర్ట్స్‌ కోటాలో టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి ఫలితాలను విడుదల చేసింది..

AP Mega DSC 2025 Results: మెగా డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా ఫలితాలు విడుదల.. వెబ్‌సైట్‌లో ఇలా చెక్‌ చేసుకోండి..
Mega DSC Sports Quota Results

Updated on: Aug 09, 2025 | 6:26 AM

అమరావతి, ఆగస్టు 9: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మెగా డీఎస్సీ పరీక్షలు ముగిసి నెల రోజులు గడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో  ఫలితాల కోసం ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు విద్యాశాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. స్పోర్ట్స్‌ కోటాలో టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు ప్రాథమిక జాబితాను అధికారిక వెబ్‌సైట్‌ http://sportsdsc.apcfss.in, http://sports.ap.gov.inలో ఉంచింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తమ ఫలితాలను చెక్‌ చేసుకోవాలని శాప్‌ ఎండీ అజయ్‌జైన్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

తాజాగా విడుదలైన ప్రాథమిక జాబితాలో ఏవైనా అభ్యంతరాలుంటే ఆగస్టు 13 అర్ధరాత్రి 12 గంటల్లోపు వెబ్‌సైట్‌ ద్వారానే ఆన్‌లైన్‌లో తెలియజేయాలని తన ప్రకటనలో సూచించారు. అభ్యంతరాలు పరిష్కరించిన అనంతరం తుది జాబితాను విద్యాశాఖకు పంపిస్తారు. ఇప్పటికే డీఎస్సీ క్రీడా కోటా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కూడా పూర్తయ్యింది. తుది జాబితా సిద్ధమయ్యాక త్వరితగతిన విడుదల చేసి, నియామక పత్రాలు అందజేస్తారు.

కాగా మొత్తం 16,347 ఉద్యోగాల భర్తీకి జూన్‌ 6 నుంచి జులై 2 వరకు విద్యాశాఖ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని పరీక్షలకు సంబంధించి తుది ఆన్సర్‌ కీలను కూడా విద్యాశాఖ విడుదల చేసింది. త్వరలోనే వీటికి సంబంధించిన ఫలితాలు వెల్లడికానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us